టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ భారత మార్కెట్ కోసం మరో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ (హెచ్‌బిసి అనే కోడ్‌నేమ్‌తో) తయారు చేస్తోంది. ఈ మోడల్‌ను ఇప్పుడు కంపెనీ పూర్తిస్థాయిలో టెస్టింగ్ చేస్తోంది. వీలైనంత త్వరలో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయాలని టెస్టింగ్ ప్రక్రియను ముమ్మరం చేసింది. తాజాగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరోసారి ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా రష్‌లేన్ బృందం తమ కెమెరాలో బంధించింది.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

రెనాల్ట్ కిగర్ అని పిలువబడే ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని షెడ్యూల్ ప్రకారం, వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 తర్వాత భారత ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్ జోరందుకోవటంతో ఈ ఏడాది పండుగ సీజన్ నాటికే ఈ మోడల్‌ను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయాలని రెనాల్ట్ భావిస్తున్న తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ మోడల్ టెస్టింగ్ ప్రక్రియను కంపెనీ వేగవంతం చేసింది.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

రష్‌లేన్ బృందం రెండు కిగర్ ఎస్‌యూవీలను టెస్టింగ్ దశలో ఉండా తమ కెమెరాలో బంధించింది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయటంతో ఈ మోడల్ డిజైన్ వివరాలు పెద్దగా తెలియకపోయినప్పటికీ, ఇది రెనాల్ట్-నిస్సాన్ బ్రాండ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మంచి క్యాబిన్ స్పేస్ ఉండనుంది. ఇందులో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునేలా ఉంటుంది. రెనాల్ట్ కిగర్ పెద్ద వీల్ ఆర్చెస్, బోల్డ్ క్రీజ్ లైన్స్, ఫ్లోటింగ్-రూఫ్ డిజైన్‌తో మంచి రగ్గడ్ లుక్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

ఇంకా రెనాల్ట్ కిగర్ మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పూర్తి-డిజిటల్ 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. రెనాల్ట్ కిగర్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే.. రెనాల్ట్ ఇందులో రెండు 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. లోయర్-స్పెక్ వేరియంట్లలో న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్‌ను రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి నుంచి గ్రహించనున్నారు. ఈ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్‌ని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కిగర్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను చేర్చడం. ప్రస్తుతం 'హెచ్‌ఆర్10' (హెచ్ఆర్10) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా సుమారు 95 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ టర్బో-పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడే ఆస్కారం ఉంది.

టెస్టింగ్ దశలో కొత్త రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - వివరాలు

రెనాల్ట్ కిగర్ ర్యాపిడ్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త రెనాల్ట్ కిగర్ అధునాతన ఫీచర్లతో పాటుగా టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని మేము అంచనా వేస్తున్నాము. భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రీజ్జా మొదలైన మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Rushlane

More from DriveSpark

Article Published On: Monday, July 6, 2020, 10:12 [IST]
English summary
The Renault Kiger was, once again, spotted testing on the India roads and this time there were two cars. The Kiger (codename HBC) will be a sub-4m SUV compact SUV from the company. The compact SUV was supposed to make its debut sometime early next year, but now it is likely to go on sale around this year's festive season. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+