రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

By N Kumar

రెనో ఇండియా విపణిలోకి క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2020 రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ కారు ధర రూ. 2.91 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రెనో క్విడ్ గతంలో లభించే అవే STD, RXE, RXL, RXT మరియు క్లైంబర్ అనే వేరియంట్లలో యధావిధిగా లభిస్తుంది.

రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

బీఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటో రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ ధర సుమారుగా 9,000 వరకూ పెరిగింది. రెనో క్విడ్ బీఎస్4 మరియు బీఎస్6 వెర్షన్‌ల ధరలు వేరియంట్ల వారీగా క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

Variant BS6 Price BS4 Price Difference
STD Rs 2.92 Lakh Rs 2.83 Lakh Rs 9,000
RxE 0.8 Rs 3.62 Lakh Rs 3.53 Lakh Rs 9,000
RxL 0.8 Rs 3.92 Lakh Rs 3.83 Lakh Rs 9,000
RxT 0.8 Rs 4.22 Lakh Rs 4.13 Lakh Rs 9,000
RxT 1.0 Rs 4.42 Lakh Rs 4.33 Lakh Rs 9,000
RxT (O) 1.0 Rs 4.50 Lakh Rs 4.41 Lakh Rs 9,000
RxT AT 1.0 Rs 4.72 Lakh Rs 4.63 Lakh Rs 9,000
RxT (O) AT 1.0 Rs 4.79 Lakh Rs 4.70 Lakh Rs 9,000
Climber Rs 4.63 Lakh Rs 4.54 Lakh Rs 9,000
Climber (O) Rs 4.71 Lakh Rs 4.62 Lakh Rs 9,000
Climber AT Rs 4.93 Lakh Rs 4.84 Lakh Rs 9,000
Climber (O) AT Rs 5.01 Lakh Rs 4.92 Lakh Rs 9,000
రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్ అప్‌డేట్ మినహాయిస్తే, బీఎస్6 రెనో క్విడ్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఈ మధ్యనే క్విడ్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన‌లో లాంచ్ చేసింది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో లేటెస్ట్ అప్‌డేట్స్ వచ్చాయి.

రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

క్విడ్ ఫేస్‌‌లిఫ్ట్‌లో ఉన్న పలు ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, అత్యాధునిక అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్‌లైట్ క్లస్టర్, 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లు, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఏబీఎస్, ఇబీజీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి.

రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

రెనో క్విడ్ బీఎస్6 అదే మునుపటి 1.0-లీటర్ మరియు 800సీసీ పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తోంది. రెండింటినీ ఏప్రిల్ 01, 2020 నుండి అమల్లోకి రానున్న బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు.

రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

రెండు ఇంజన్‌లు కూడా బీఎస్4 వెర్షన్‌ ఇంజన్‌ల మాదిరిగా అదే పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిలో 800సీసీ ఇంజన్ 54బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.0-లీటర్ ఇంజన్ 68బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండింటినీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 1.0-లీటర్ ఇంజన్‌ను అదనంగా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

రెనో క్విడ్ బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 2.91 లక్షలు మాత్రమే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫ్రెంచ్ దిగ్గజం రెనో తమ బెస్ట్ సెల్లింగ్ & పాపులర్ హ్యాచ్‌‌బ్యాక్ క్విడ్ కారును ఇప్పుడు బీఎస్6 వెర్షన్‌లో ప్రవేశపెట్టి, కస్టమర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈమధ్యనే రెనో ట్రైబర్ కారును కూడా బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. రెనో క్విడ్ బీఎస్6 మార్కెట్లో ఉన్న మారుతి ఎస్-ప్రెస్సో, మారుతి ఆల్టో కె10 మరియు డాట్సన్ రెడీ-గో మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2020, 15:17 [IST]
English summary
Renault Kwid BS6 Launched In India: Prices Start At Rs 2.92 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+