భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్‌ను రూ. 4.29 లక్షల ధరతో ప్రవేశపెట్టారు. ఇది క్విడ్ యొక్క టాప్ వేరియంట్లలో 0.8 లీటర్ మాన్యువల్ మరియు 1.0 లీటర్ మాన్యువల్ మరియు AMT ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 30,000 ఖరీదైనది, డ్యూయల్ టోన్ కలర్ జాన్స్కర్ బ్లూ మరియు సిల్వర్ రూఫ్ తో లేదా సిల్వర్ రూఫ్ మరియు జాన్స్కర్ బ్లూ రూఫ్ తో లభిస్తుంది. ఇందులో అనేక ప్రత్యేక ఫీచర్స్ కూడా ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్‌లో సి పిల్లర్‌లో 3 డి డెకాల్స్, ఫ్లెక్స్ వీల్స్ మరియు నియోటెక్ డోర్ క్లాడింగ్ ఉన్నాయి. లోపలి భాగంలో కొత్త బ్లూ మరియు బ్లాక్ ఫాబ్రిక్ అప్హోల్స్టరీ మరియు సీటుపై బ్లూ స్టిచ్చింగ్, స్టీరింగ్ వీల్‌పై జెన్స్కర్ క్రోమ్ బ్లూ హైలైట్ మరియు గేర్ నాబ్‌పై క్రోమ్ సరౌండ్ లభిస్తుంది.

ఇది రెగ్యులర్ RXT వేరియంట్ నుండి తీసుకోబడిన 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది, దీనికి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మరియు రివర్స్ కెమెరా ఇవ్వబడ్డాయి. పండుగ సీజన్లో అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

కొత్త క్విడ్ నియోటెక్ 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉపయోగించబడ్డాయి. దీని 799 సిసి ఇంజన్ 53 బిహెచ్‌పి శక్తిని, 72 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది, అయితే హై వేరియంట్‌లోని 1.0-లీటర్ ఇంజన్ 67 బిహెచ్‌పి శక్తిని, 91 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ప్రామాణికంగా ఇవ్వబడుతుంది.

అయితే 1.0-లీటర్ ఇంజిన్‌తో AMT గేర్‌బాక్స్ యొక్క ఎంపిక ఉంటుంది. రెనాల్ట్ క్విడ్‌లో 5 సంవత్సరాలు / 1 లక్ష పొడిగించిన అప్సనల్ వారంటీని అందిస్తుంది. దీనితో పాటు రెనాల్ట్ ఈజీ కేర్ ప్రీపెయిడ్ సర్వీస్‌ను కూడా అందిస్తున్నారు.

రెనాల్ట్ క్విడ్ ప్రస్తుతం సంస్థ యొక్క చిన్న మోడల్. అయితే మార్కెట్లో బాగా మంచి అమ్మకాలను సాధిస్తోంది. ఇది మారుతి ఎస్-ప్రెసో, హ్యుందాయ్ సాంట్రో వంటి మోడళ్లతో పోటీ పడుతోంది. పండుగ సీజన్లో ఇటువంటి మోడళ్లతో మరింత పోటీ పడటానికి స్పెషల్ ఎడిషన్ ప్రవేశపెట్టబడింది.

రెనాల్ట్ క్విడ్ 2015 లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది మరియు అప్పటికి 3.5 లక్షల యూనిట్లను విక్రయించింది. మార్కెట్లో పండుగ సిజన్ కావడం వల్ల ఈ స్పెషల్ ఎడిసన్ అమ్మకాలలో మరింత ముందుకు దూసుకువెళ్ళే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ ఎడిషన్ వాహనదారులను ఎక్కువగా ఆకర్షించే అవకాసం ఉందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








