రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ఇండియా, సెప్టెంబర్ నెలలో తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ మరియు వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో రెనాల్ట్ కారును కొనుగోలు చేసే కస్టమర్, వారు ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.70,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ ప్రోడక్ట్ లైనప్‌లో ఉన్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ ఎమ్‌పివి మరియు డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్‌ను కంపెనీ అందిస్తోంది. అర్హతను బట్టి రెనాల్ట్ ఇండియా నాలుగు నెలల ఈఎమ్ఐ తాత్కాలిక నిషేధాన్ని కూడా అందిస్తోంది. ఇప్పుడు రెనాల్ట్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు వచ్చే ఏడాది నుండి మాత్రమే ఈఎమ్ఐ చెల్లించే అవకాశాన్ని పొందవచ్చు.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

సెప్టెంబర్ 2020లో తగ్గింపు ఆఫర్లలో భాగంగా, క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పో డిస్కౌంట్స్, లాయల్టీ బోనస్, మెయింటినెన్స్ ప్యాకేజీలు మరియు దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారుల కోసం ప్రత్యేకమైన నగదు తగ్గింపులు మొదలైనవి ఉన్నాయి. రెనాల్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌పై కంపెనీ వేరియంట్‌ను బట్టి రూ.35,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

వీటికి అదనంగా, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం రూ.9,000 కార్పోరేట్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు అదనంగా రూ.5,000 నగదు బోనస్ లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ బోనస్ కోసం కస్టమర్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది, అర్హతను చెక్ చేసిన తర్వాత మాత్రమే వారికి ఆయా డిస్కౌంట్లను ఆఫర్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా, ఈ మోడల్‌పై 6.99 శాతం తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేకమైన ఫైనాన్స్ పథకాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ రెండు ఇంజన్ మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తోంది. మార్కెట్లో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.2.94 లక్షలుగా ఉంటే టాప్ ఎండ్ క్విడ్ క్లైంబర్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.5.07 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ, ఢిల్లీ) ఉంది.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ అందిస్తున్న కాంపాక్ట్ ఎమ్‌పివి ట్రైబర్‌పై ఈ సెప్టెంబర్ నెలలో కంపెనీ రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ర .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ క్విడ్‌పై అందిస్తున్నట్లుగానే ట్రైబర్ ఎమ్‌పివిపై కూడా రూ.9,000 కార్పోరేట్ డిస్కౌంట్ లేదా రూ.4,000 గ్రామీణ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వీటికి అదనంగా, రెనాల్ట్ తమ కస్టమర్లకు 6.99% వడ్డీ రేటుతో సులభమైన ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది, ఇది 24 నెలల కాలపరిమితి కోసం రూ.3.82 లక్షల రుణ మొత్తంలో లెక్కించబడుతుంది.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 6250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్‌షిప్ మోడల్ డస్టర్ ఎస్‌యూవీ కంపెనీ గరిష్టంగా రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.20,000 లాయల్టీ బెనిఫిట్‌లు ఉన్నాయి. ఇవి వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

కంపెనీ ఇటీవలే విడుదల చేసిన రెనాల్ట్ డస్టర్ టర్బో వేరియంట్‌పై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బోనస్ మరియు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఈజీ కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్‌లు ఉన్నాయి.

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

వీటితో పాటు, కార్పోరేట్ బోనస్ లేదా గ్రామీణ ఆఫర్‌లో భాగంగా, డస్టర్‌పై వరుసగా రూ.22,000 లేదా రూ.15,000 నగదు తగ్గింపు లభిస్తుంది. మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర రూ.8.49 లక్షలుగా ఉంటే, డస్టర్ టర్బో ధర రూ.10.49 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

రెనాల్ట్ సెప్టెంబర్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం భారత్‌లో పండుగ సీజన్ నడుస్తోంది, ఈ మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ కంపెనీ తమ ఉత్పత్తులపై ఉత్తేజకరమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. రెనాల్ట్ కూడా ఈ సీజన్‌లో తమ అమ్మకాలను పెంచుకునే దిశగా ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై తగ్గింపులను, ఆఫర్లను అందిస్తోంది.

Most Read Articles

English summary
Renault India has announced discounts and offers on all models in the brand's line-up for the month of September. Maximum benefits of up to Rs 70,000 is offered this month depending on the model and variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X