గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ దేశంలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలపై దృష్టి పెడతామని కంపెనీ తెలిపింది.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

రెనాల్ట్ ఇండియా ఇటీవలే తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మరియు ఎమ్‌పివి ట్రైబర్ మోడళ్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పెంచే దిశగా రెనాల్ట్ పనిచేస్తోంది.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

ఈ విషయంపై రెనాల్ట్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ, "మేము త్వరలో డస్టర్‌ను సరికొత్త టర్బో ఇంజన్ (పెట్రోల్) తో విడుదల చేయనున్నాం. ఈ కొత్త ఇంజన్ డస్టర్‌ను దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా మారుస్తుంద"ని అన్నారు.

MOST READ:కేరళలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

రెనాల్ట్ కంపెనీకి భారతదేశం అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటని, గత కొన్నేళ్లుగా దేశంలో బ్రాండ్ మొత్తం అమ్మకాల ప్రాతిపదికన చూసుకుంటే, టాప్ 10 గ్లోబల్ మార్కెట్లలో భారత మార్కెట్ కూడా ఒకటిగా ఉందని ఆయన అన్నారు.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

రెనాల్ట్ బ్రాండ్ అందిస్తున్న క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లు రెండూ కూడా భారత మార్కెట్లలో మంచి పనితీరును కనబరచాయి. మరోవైపు ఈ రెండు మోడళ్లలో ఏఎమ్‌టి వేరియంట్ల విడుదలపై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారని, ఇది చాలా ఆశాజనకంగా ఉందని రెనాల్ట్ తెలిపింది.

MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

గ్రామీణ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించడం రెనాల్ట్ మధ్య-దీర్ఘకాలిక వ్యూహం. ఈ బ్రాండ్ ఇప్పటికే దేశంలోని 330 గ్రామీణ పట్టణాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

మామిళ్లపల్లె మాట్లాడుతూ, "ఇది మేము వినూత్నంగా మరియు సమగ్రమైన వ్యూహంతో వేగంగా అనుసరిస్తున్న ప్రణాళిక. గ్రామీణ భారతదేశంలో మా ఉనికిని పెంచుకోవడానికి ఇప్పటికే విస్తార్ అనే ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రారంభించాము. గ్రామీణ మార్కెట్లను చేరుకోవటానికి మా డీలర్‌షిప్ బృందాలు ప్రత్యేక సేల్స్ కన్సల్టెంట్లను కూడా నియమించాయ"ని అన్నారు.

MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో భారత గ్రామీణ మార్కెట్లో రెనాల్ట్ సాధించిన 19 శాతం వృద్ధితో పోలిస్తే, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధించిన మార్కెట్ వాటా 25 శాతం పెరిగింది.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

కోవిడ్-19 కారణంగా మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. అమ్మకాలను పెంచుకోవటం కోసం కంపెనీ ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది, అమ్మకాల లక్ష్యాలను కూడా సడలించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ భాగస్వాములకు నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే ప్రత్యేక కార్యక్రమాలతో పాటుగా ఇన్వెంటెరీ హ్యాండ్లింగ్ ఖర్చుల విషయంలో కూడా రెనాల్ట్ తమ డీలర్లకు సహకరిస్తోంది.

MOST READ:గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

ఈ లాక్‌డౌన్ సమయాన్ని భారత మార్కెట్ కోసం కొత్త వ్యూహాలను రచించడంపై దృష్టి పెట్టడానికి కేటాయించామని, దేశంలో ప్రధానమైన బ్రాండ్‌గా ఎదగడానికి వనరులు మరియు సామర్థ్యాలపై పెట్టుబడి పెట్టనున్నట్లు రెనాల్ట్ తెలిపింది.

గ్రామీణ మార్కెట్లే రెనాల్ట్ టార్గెట్; భారత్‌లో మరిన్ని కొత్త కార్ల విడుదల!

గ్రామీణ మార్కెట్ల కోసం రెనాల్ట్ కొత్త కార్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

తయారీదారులకు భారతదేశంలోని గ్రామీణ మార్కెట్లు చాలా ప్రధానమైనవి. వాస్తవానికి మహీంద్రా వంటి బ్రాండ్లు ఈ మార్కెట్లలోని అవకాశాలను దక్కించుకునేందుకు తమ వనరులను గణనీయంగా అటువైపు మళ్లించాయి. రెనాల్ట్ కూడా గ్రామీణ మార్కెట్ల కోసం సరసమైన ధరకే ఉత్పత్తులను అందించగలిగితే ఈ మార్కెట్లలో నెగ్గుకొచ్చే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
French auto manufacturer Renault has announced that it plans to launch new models in the country and said it would focus sales in rural areas in order to strengthen its position in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X