8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

రోల్స్ రాయిస్ ఇండియన్ మార్కెట్లోకి కలినన్ ఎస్‌యూవీని బ్ల్యాక్ బ్యాడ్జ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. సరికొత్త రోల్స్ రాయిస్ బ్ల్యాక్ బ్యాడ్జ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.2 కోట్లుగా నిర్ణయించారు.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

రోల్స్ రాయిస్ కలినన్ స్టాండర్డ్ వెర్షన్‌తో పోల్చితే బ్ల్యాక్ బ్యాడ్జ్ వెర్షన్ మరింత స్పోర్టివ్‌గా ఉంటుంది. ప్రపంచంలోకెల్లా ఖరీదైన లగ్జరీ కార్లను తయారీ చేసే టాప్ బ్రాండ్ రోల్స్ రాయిస్ తమ కలినన్ ఎస్‌యూవీని అవే లగ్జరీ అంశాలతో స్పోర్టివ్ శైలిలో బ్ల్యాక్ బ్యాడ్జ్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఇందులో ఆల్-బ్ల్యాక్ పెయింట్ స్కీమ్, వెనుక వైపున రెండు ఎగ్జాస్ట్ పైపులు, 22-ఇంచుల ఫోర్జింగ్ చేసిన అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ మరియు ఎస్‌యూవీ చుట్టూ చేతితో పెయింట్ చేసిన కోచ్‌లైన్ వంటి స్టైలిష్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

రోల్స్ రాయిస్ కలినన్ బ్ల్యాక్ బ్యాడ్జ్ లగ్జరీ ఎస్‌యూవీలో అక్కడా అత్యంత ఆకర్షణీయమైన క్రోమ్ సొబగులు స్థానంలో బ్లాక్ కలర్ ఫినిషింగ్స్ వచ్చాయి. ఇందులో బ్ల్యాక్ కలర్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, గ్రిల్ సరౌండింగ్స్, ఫ్రేమ్ ఫినిషింగ్స్, డిక్కీ డోర్ హ్యాండిల్, కిందివైపునున్న ఎయిర్ ఇంటేకర్ మరియు బూట్ రిమ్ వంటివి చూడొచ్చు.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

బ్ల్యాక్ కలర్ ఫినిషింగ్స్ ఇంటీరియర్‌కు మాత్రమే పరిమితం కాలేదు, ఎక్ట్సీరియర్‍లో కూడా వీలైనన్ని ప్రదేశాల్లో బ్ల్యాక్ కలర్ హైలెట్స్ వచ్చాయి. కార్బన్ ఫైబర్ మీద, బ్ల్యాక్ కలర్‌ దారంతో కుట్టబడిన ఇంటీరియర్ అత్యుత్తమ లగ్జరీ ఫీలింగ్ ఇస్తోంది.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

సరికొత్త రోల్స్ రాయిస్ కలినన్ బ్ల్యాక్ బ్యాడ్జ్ లగ్జరీ అండ్ స్పోర్టివ్ ఎస్‌యూవీలో అదే మునుపటి 6.75-లీటిర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టుర్భో వి12 ఇంజన్ కలదు.

సాధారణ కలినన్‌తో పోల్చుకుంటే బ్ల్యాక్ బ్యాడ్జ్ ఎడిషన్ మరింత శక్తివంతమైనది. ఇది సుమారు 600బిహెచ్‌పి పవర్ మరియు 900ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ వెర్షన్ కంటే ఇది 29బిహెచ్‌పి పవర్ మరియు 50ఎన్ఎమ్ వరకు అదనపు శక్తినిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

లగ్జరీ కార్లు తయారు చేసే రోల్స్ రాయిస్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీ రోల్స్ రాయిస్ కలినన్. నిజానికి రోల్స్ రాయిస్ కలినన్ ఎస్‌యూవీని 2018లోనే అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. 2018 చివరినాటికి రోల్స్ రాయిస్ కలినన్ రూ. 6.95 కోట్ల ధరతో విడుదల అయ్యింది.

8.2 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కలినన్ లాంచ్: ఎలాగో కొనలేం.. హైలెట్స్ & ఫోటోలు చూద్దాం రండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కలినన్ స్టాండర్డ్ వెర్షన్‌లోని క్రోమ్ ఎలిమెంట్లు తొలగించి కంప్లీట్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌ వెర్షన్ రోల్స్ రాయిస్ కలినన్ బ్ల్యాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీ, లగ్జరీ అంశాలతోనే స్పోర్టివ్ ఫీల్ తీసుకొచ్చేందుకు ఇలా రూపొందించారు. రోల్స్ రాయిస్ ఇండియా ఫ్యామిలీలో ఘోస్ట్, వ్రత్ మరియు డాన్ అనే మోడళ్లను విక్రయిస్తోంది, వీటి సరసన కలినన్ ఎస్‌యూవీ వచ్చి చేరింది. ఇది విపణిలో ఉన్న బెంట్లీ బెంట్యాగ మరియు ల్యాంబోర్ఘిన ఉరస్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2020, 16:02 [IST]
English summary
Rolls Royce Cullinan Black Badge Launched In India: Prices Start At Rs 8.2 Crore. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+