రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ప్రముఖ ఇండియన్స్ వీరే

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లలో రోల్స్ రాయిస్ ప్రధానమైనవి. రోల్స్ రాయిస్ 2018 చివరిలో కలినన్ లగ్జరీ ఎస్‌యువిని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ. 6.95 కోట్లు. ఇది భారతదేశంలో అమ్మకానికి దిగిన అత్యంత విలాసవంతమైన ఎస్‌యువి.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన రెగ్యులర్ ప్రొడక్షన్ ఎస్‌యూవీలలో రోల్స్ రాయిస్ కలినన్ ఒకటి. ఇంతటి ఖరీదైన ఈ కార్లను కొంతమంది భారతీయులు కూడా కొనుగోలు చేశారు, మరియు వారిలో కొందరు ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రదేశాలలో ఉన్నారు. ఇప్పుడు రోల్స్ రాయిస్ కలినన్ కలిగిన 5 మంది భారతీయ యజమానులను పరిశీలిద్దాం.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

అనంత్ అంబానీ

అంబానీ గ్యారేజ్ లో భారతదేశంలో ఉత్తమమైన మరియు ఇతర దేశాల యొక్క ఫేమస్ కార్లు చాలా ఉన్నాయి. ఈ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కలినన్ కూడా ఉంది. అనంత్ అబానీ గ్యారేజ్ లో ఉన్న ఈ కారు ప్రత్యేకమైన రంగును కలిగి ఉంది. ఇది కొంత వరకు లేత గోధుమ రంగులో ఉంటుంది.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

అనంత్ అంబానీ యొక్క లేత గోధుమ రంగు రోల్స్ రాయిస్ కలినన్ ఇంటీరియర్‌లను అనుకూలీకరించారా లేదా అనేది తెలియదు కాని ఈ కలినన్ బెస్పోక్ ఇంటీరియర్‌లను కలిగి ఉండవచ్చు. కొన్ని వరాల క్రితం అనంత్ అంబానీ ఈ వాహనంలో కనిపించారు. ఈ రోల్స్ రాయిస్ కలినన్ కారులో అంబానీ కుటుంభం సభ్యుడు కనిపించడం ఇదే మొదటి సారి.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

అజయ్ దేవగన్

ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అయిన అజయ్ దేవగన్ ఆటో ఔత్సాహికుడు కాకపోయినా అతని గ్యారేజ్ లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మినీ కూపర్, బిఎమ్‌డబ్ల్యూ జెడ్ 4 తో పాటు మరికొన్నిపెద్ద కార్లు ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు రోల్స్ రాయిస్ కలినన్ కూడా కొనుగోలు చేసాడు. ఇది ముదురు రంగులో ఉంటుంది.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

రోల్స్ రాయిస్ కుల్లినన్ కారులో అజయ్ దేవగన్ ని గుర్తించనప్పటికీ, అతని కొత్త కలినన్ చిత్రాలు ఇంటర్నెట్‌ను చుట్టుముట్టాయి. ఇవి మాత్రమే కాకుండా కారు రిజిస్ట్రేషన్ ప్రకారం ప్రభుత్వ రికార్డులో అజయ్ దేవ్‌గన్‌కు చెందినదని చూపిస్తుంది.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

రూబెన్ సింగ్

అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కలినన్ కారుని కలిగిన వారిలో రూబెన్ సింగ్ ఒకరు. రూబెన్ సింగ్ దాదాపు 20 రోల్స్ రాయిస్ కలినన్ లను కలిగి ఉన్నట్లు చెబుతారు. అతని గ్యారేజ్ లో ఒక్క రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా బుగట్టి వెయ్రోన్‌తో సహా ఆటోమోటివ్ ప్రపంచంలో వున్నా చాలా విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. గొప్ప పారిశ్రామిక వేత్త అయినా రూబెన్ సింగ్ దగ్గర రూబీస్, ఎమర్లాండ్స్ మరియు నీలమణి రంగులతో ఉన్న రోల్స్ రాయిస్ ఉన్నాయి.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

భూషణ్ కుమార్

భూషణ్ కుమార్ టి-సిరీస్ ఛైర్మన్ మరియు ఎండి. అంతే కాకుండా ఇతడు మూవీస్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ మరియు కంపోసర్ కూడా. భారతదేశంలో రోల్స్ రాయిస్ కలినన్ యొక్క మొదటి కొనుగోలుదారులలో భూషణ్ కుమార్ ఒకరు. ఇతడు వైన్ రెడ్ కలినన్ ను కొనుగోలు చేసాడు.

భూషణ్ కుమార్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కలినన్ బాలీవుడ్‌లో మొట్టమొదటి కలినన్ అయింది. ఈ రోల్స్ రాయిస్ కలినన్ 6.75 లీటర్ వి 12 పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 563 బిహెచ్‌పి శక్తి వద్ద 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

అభిని సోహన్ రాయ్

అభిని సోహాన్ రాయ్ రోల్స్ రాయిస్ కుల్లినన్ పొందిన మొదటి భారతీయరాలు. ప్రస్తుతం రోల్స్ రాయిస్ కలినన్ సొంతం చేసుకున్న ఏకైక భారతీయ మహిళా కూడా ఈమే. దుబాయ్ లో ఉన్న అభిని సోహన్ రాయ్ కి తమ సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భర్త ఇచ్చిన బహుమతి ఈ రోల్స్ రాయిస్ కలినన్.

మీకు తెలుసా.. రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన 5 మంది ఇండియన్స్ వీరే

ఈ రోల్స్ రాయిస్ కలినన్ 6.75 లీటర్ వి 12 పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 563 బిహెచ్‌పి శక్తి వద్ద 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 14, 2020, 13:18 [IST]
English summary
5 famous Rolls Royce Cullinan owners: Anant Ambani to Ajay Devgn. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+