కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

దేశంలో కోవిడ్ -19 మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నప్పటికీ, సెకండ్ కార్ల వ్యాపారం మాత్రం జోరందుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆశిస్తోంది. ఈ సంక్షోభం వలన మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ల విభాగం ప్రభావితం కాదని కంపెనీ తెలిపింది.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

అయితే, సెకండ్ హ్యాండ్ కార్ల విభాగపు వృద్ధి కొత్త కార్ల విభాగంతో పోల్చుకుంటే తక్కువగా ఉండనుంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలతో పాటు, బ్రాండ్ న్యూ కార్ల అమ్మకాలు కూడా ప్రోత్సాహకర రీతిలో ఉండొచ్చని మెర్సిడెస్ బెంజ్ అంచనా వేస్తోంది.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా యొక్క ఎమ్‌డి మరియు సీఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "మూడు కోణాల నక్షత్రాన్ని సొంతం చేసుకోవాలనుకునే యువ మరియు మొదటిసారి కొనుగోలుదారులు, ఈ ఉత్పత్తులను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సాధారణంగా కొత్త కార్ల కంటే ముందుగా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను ఎంచుకుంటారు. కాబట్టి ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము అలాగని ఇది కొత్త కార్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మేము అనుకోవటం లేదు" అని చెప్పారు.

MOST READ: భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

కంపెనీ ప్రకారం, భారత మార్కెట్లో ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారానికి పటిష్టమైన అవకాశాలు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఈ మార్కెట్లో తొమ్మిది సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకుంది. ఈ సమయంలో అనేక మంది కొత్త కస్టమర్లను తమ బ్రాండ్ వైపుకు ఆకర్షించింది.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

మెర్సిడెస్ బెంజ్ తమ కొత్త కార్ కస్టమర్లకు అందించే సేవలు, ఫైనాన్షియల్ ఆఫర్లు, బ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్‌ను తమ ప్రీ-ఓన్డ్ కస్టమర్లకు కూడా అందిస్తోంది. అంటే దీని అర్థం, భారత్‌లోని సెకండ్ హ్యాండ్ వాహన మార్కెట్లో కూడా కస్టమర్లు లగ్జరీ బ్రాండ్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నారన్నమాట.

MOST READ: భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

అంతేకాకుండా, ఈ సంస్థ తన ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ల విభాగాన్ని జోడించింది. ఇది కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల ప్లాట్‌ఫామ్‌లో ప్రీ-ఓన్డ్ కార్లపై కస్టమర్లలో బలమైన ఆసక్తిని కనబరిచింది. మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ గత ఐదేళ్లలో 20,500 యూనిట్ల ప్రీ-ఓన్డ్ కార్లను విక్రయించింది. ప్రీ-ఓన్డ్ కార్ల విభాగంలో అసాధారణమైన 20 శాతం సంచిత వృద్ధిని మెర్సిడెస్ సర్టిఫైడ్ నమోదు చేసుకుంది.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి ష్వెంక్ మాట్లాడుతూ, "మాక్రో-ఎకనామిక్ హెడ్‌విండ్స్, కోవిడ్-19 సంబంధిత సవాళ్లు మరియు మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో వాల్యూమ్ మోడల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మా అమ్మకాలు ప్రభావితమయ్యాయి. ఇక నుండి గడచిన త్రైమాసికపు నష్టాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంద"ని అన్నారు.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

తమ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీకి మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు, సామాజిక దూరం కారణంగా, వినియోగదారులు ఆన్‌లైన్‌లో కార్లను సురక్షితంగా కొనుగోలు చేయడాన్ని ఎంచుకుంటున్నారని, తమ సంస్థ ఇప్పటికే డిజిటల్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 100కు పైగా బుకింగ్‌లను అందుకుందని ష్వెంక్ చెప్పారు.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

ఇక మెర్సిడెస్ బెంజ్‌కి సంబంధించిన ఇత వార్తల్లోకి వెళితే.. ఈ ఏడాది తమ ఉనికిని పెంచుకునేందుకు కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో కొన్ని కొత్త కార్లను విడుదల చేసింది. తాజాగా.. ఈ జర్మన్ బ్రాండ్ నుంచి సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని కంపెనీ విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ధర రూ.99.9 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

మెర్సిడెస్ బెంజ్ ప్రీ-ఓన్డ్ వ్యాపారంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో అద్భుతమైన పురోగతిని చవిచూసింది. తొలిసారిగా లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కొత్త కారు కొనుగోలుతో పోల్చితే తక్కువ ధర ఉన్నందున ప్రీ-ఓన్డ్ కారుకు మారే అవకాశం ఉంది. మరోవైపు మెర్సిడెస్ బెంజ్ కూడా కొత్త/పాత అన్న తేడా లేకుండా కస్టమర్లందరికీ ఒకేరకమైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో కొత్త కార్లను కొనేవారు అలాగే సెకండ్ హ్యాండ్ కార్లను కొనేవారు ఒకేరకమైన బ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతున్నారు.

Most Read Articles

English summary
Mercedes-Benz India expects the pre-owned car sales to increase in demand despite the ongoing Covid-19 pandemic in the country. The company says that its certified pre-owned car segment to remain unaffected from the crisis. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X