Just In
Don't Miss
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- News
విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్
భారతదేశంలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన వాటిలో కియా మోటార్స్ ఒకటి. కియా మోటార్స్ భారతదేశంలో విడుదల చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ కియా సెల్టోస్. కియా యొక్క సెల్టోస్ ఎస్‌యూవీ భారతీయ వినియోగదారులను ఆకర్షించడంలో విజయవంతమైంది.

కియా సెల్టోస్ ఎస్‌యూవీ అనేక కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఎస్‌యూవీ యొక్క ఆకర్షణీయమైన లుక్ మరియు అధునాతన ఫీచర్స్ కస్టమర్ ని మరింత ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ పాపులర్ కియా యొక్క ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిసింది.

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. సెల్టోస్ యొక్క ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మొదట చైనా మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తరువాత ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయవచ్చు. ఈ కొత్త సెల్టోస్ ఎలక్ట్రిక్ కార్ కొత్త తరం కియా కెఎక్స్ 3 ఎలక్ట్రిక్ కార్ గా చైనా మార్కెట్లో లాంచ్ చేయవచ్చు.
MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

ప్రస్తుత తరం కియా కెఎక్స్ 3 ఇవి 45.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చారు. ఇది 11 బిహెచ్‌పి శక్తిని మరియు 285 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎస్‌యూవీ ఒకే ఛార్జీతో 300 కి.మీ ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. కియా సెల్టో యొక్క ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని చైనా మార్కెట్లో స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కియా సెల్టోస్ యొక్క ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కంపెనీ సిరీస్‌లో అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది.
MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న కియా సెల్టోస్ ఎస్‌యూవీని బిఎస్-6 ఇంజన్ యొక్క మూడు ఇంజన్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. వీటిలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని చైనా మార్కెట్లో విడుదల చేయనున్నారు. కానీ కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం లేదు.