పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులైన స్కోడా మరియు వోక్స్వ్యాగన్ పూణేలోని కరంజ్‌విహైర్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్ (పిహెచ్‌సి) కు మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్‌ను అందించారు. ఈ మెడికల్ క్లినిక్ వ్యాన్ సుమారు 12 గ్రామాలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

పూణేలోని కంపెనీ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఈ సేవలు చేయబడతాయి. స్కోడా మరియు వోక్స్వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుర్ ప్రతాప్ బోపరాయ్, పూణేలోని సంస్థ యొక్క కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్ ని ఖేడ్ తాలూకా వైద్య అధికారులకు అందజేశారు.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉపయోగిస్తున్న 15 ఏళ్ల అంబులెన్స్‌కు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఈ వ్యాన్‌ను ఆరు నెలల పాటు వైద్య సంస్థకు అందించారు. మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్ గర్భిణీ స్త్రీలను సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో ఆసుపత్రులకు రవాణా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

వీటితో పాటు, పూడాలోని మహలుంగే సంరక్షణ కేంద్రానికి స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ రూ. 14 లక్షల విలువైన మందులు, అవసరమైన వైద్య పరికరాలను కూడా విరాళంగా ఇచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

స్కోడా మరియు వోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్ ప్రతాప్ బోపరాయ్ మాట్లాడుతూ భారతదేశంలో మేము సమాజ శ్రేయస్సు పట్ల గట్టిగా కట్టుబడి ఉన్నాము. ఇలాంటి మానవతా కార్యక్రమాలలో భాగం కావడానికి మరియు సమాజానికి తోడ్పడటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము, అంతే కాకుండా మేము ఆరోగ్య సంరక్షణకు మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహాయం చేయడంలో స్కోడా వోక్స్వ్యాగన్ గ్రూప్ చురుకుగా పాల్గొంటోంది. కోవిడ్ -19 రోగులకు సరైన సదుపాయాలను అందించడానికి కంపెనీ పూణేకు చెందిన సాసూన్ జనరల్ హాస్పిటల్‌కు రూ. 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

కంపెనీ ఇచ్చిన ఈ విరాళంతో మెడిసిన్స్, పిపిఇ కిట్స్ మరియు రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన ఇతర వైద్య పరికరాలను సేకరించడానికి కూడా ఉపయోగించబడింది. అంతే కాకుండా ఆరోగ్య నిపుణులకు పంపిణీ చేసిన చకన్లోని ప్లాంట్ లో ఫేస్ మాస్క్‌లను తయారు చేస్తున్నారు.

పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

దేశంలో కరోనా అధికంగా విస్తరిస్తున్న కారణంగా ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వానికి సహాయం చేయడంలో ఇప్పటికే ఆటోమోటివ్ కంపెనీలు ముందుకు వచ్చాయి. స్కోడా మరియు వోక్స్వ్యాగన్ గ్రూప్ పిపిఇలను విరాళంగా ఇచ్చింది. భయంకరమైన ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేయడంలో ఆర్థిక సహాయం కూడా అందించింది. ఔరంగాబాద్ ప్లాంట్ లోని కంపెనీ ఉద్యోగులు ఈ సమయంలో తమ ఒక రోజు జీతం విరాళంగా ఇస్తూ రూ. 1.2 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కరోనా సమయంలో ఇంకా చాలా ఆటో మోటివ్ కంపెనీలు ప్రభత్వానికి మద్దతుగా ముందుకు వస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 10, 2020, 12:26 [IST]
English summary
Skoda Auto Volkswagen Provides Mobile Clinic To Help Offer Medical Services To 12 Villages. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+