భారత్‌లో విడుదల కానున్న కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ ఎలా ఉందో చూసారా !
స్కోడా ఆటో ఇండియా ఇటీవల ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తనబ్రాండ్ అయిన కొత్త కరోక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. కంపెనీ కొత్త కరోక్ ఎస్‌యూవీని త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నారు. భారత్‌లో అడుగుపెట్టనున్న ఈ కొత్త స్కోడా కరోక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడు స్కోడా కరోక్ ఎస్‌యూవీ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‌యూవీని రూ. 50 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త స్కోడా కరోక్ ప్రారంభంలో (సిబియు) కంప్లీట్ బిల్ట్ యూనిట్‌గా లభిస్తుంది. కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే విడుదలవుతుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత ఈ స్కోడా కరోక్ ఎస్‌యూవీ వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.

రాబోయే స్కోడా కరోక్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కోడా కరోక్ ఎస్‌యూవీ కంపెనీ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ కొత్త కరోక్ ఎస్‌యూవీ ధర సుమారు రూ. 23 లక్షలు ఉంటుందని మేము భావిస్తున్నాము. కొత్త స్కోడా ఎస్‌యూవీకి చెందిన 1,000 యూనిట్లు భారతదేశంలో విడుదల కానున్నాయి.

ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లెదర్ అప్హోల్స్టరీ సీట్లు కూడా ఉన్నాయి.

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో అనేక ఆధునిక ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కోడా కరోక్ ఆరు రంగు ఎంపికలలో విడుదల కానుంది. ఇది కాండీ వైట్, మాగ్నెటిక్ బ్రౌన్, లావా బ్లూ, మ్యాజిక్ బ్లాక్, బ్రిలియంట్ సిల్వర్ మరియు క్వాటర్ గ్రే రంగులలో వస్తుంది.

ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజిన్‌లో కొత్త కరోక్ ఎస్‌యూవీని కంపెనీ విడుదల చేయదు. భవిష్యత్తులో డీజిల్ వెర్షన్లకు డిమాండ్ పెరిగితే, డీజిల్ ఇంజన్ ఆప్షన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ భారత్‌లో లాంచ్ అయిన వెంటనే ఎంజి హెక్టర్, జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఒకప్పుడు దేశీయ మార్కెట్లో ఆధిపత్యం వహించిన స్కోడా నెమ్మదిగా తన డిమాండ్‌ను కోల్పోతోంది. భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి ఇది మళ్లీ సన్నద్ధమవుతోంది. వచ్చే రెండేళ్లలో 2.0 ప్లాన్ కింద స్కోడా అనేక కొత్త కార్లను విడుదల చేయనుంది. ఏది ఏమైనా స్కోడా ఇటువంటి బ్రాండ్లను విడుదల చేయడం వల్ల పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








