స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా ఆటో భారత మార్కెట్లో విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్‌లో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించి విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

సెప్టెంబర్ 17, 2020వ తేదీన స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. స్కొడా ర్యాపిడ్ కోసం కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. ఈ కారును అందరికన్నా ముందు సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

సంభావ్య కొనుగోలుదారులు స్కోడా రాపిడ్ 1.0 టిఎస్ఐ ఆటోమేటిక్‌ను ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలోని ఏదైనా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. సెడాన్‌ను ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు ప్రాధాన్యత లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది, డెలివరీలు సెప్టెంబర్ 18, 2020 నుండి ప్రారంభమవుతాయని వివరించింది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా రాపిడ్ ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారులో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌నే స్కొడా ర్యాపిడ్ కారులోనూ ఉపయోగించారు. ఇదివరకూ ఆఫర్ చేసిన 1.6 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ స్థానాన్ని ఈ కొత్త ఇంజన్‌తో భర్తీ చేశారు.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్కొడా రాపిడ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఇప్పటి వరకూ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఇకపై ఈ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో ఉపయోగిస్తున్న సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌నే కొత్త ర్యాపిడ్ కారులోనూ ఉపయోగించనున్నారు.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

కొత్త 2020 స్కొడా రాపిడ్ కారులో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 999సిసి, త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని, 1750-4000 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా పేర్కొన్న సమాచారం ప్రకారం ఆటోమేటిక్ వెర్షన్ ర్యాపిడ్ టిఎస్ఐ మోడల్ లీటరుకు 16.24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. స్టాండర్డ్ మ్యాన్యువల్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు ఈ కొత్త ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా లభ్యం కానున్నాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన స్కొడా ర్యాపిడ్ లీటరుకు 18.97 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో 2020 స్కొడా రాపిడ్ 1.0-లీటర్ టిఎస్ఐ మాన్యువల్ సెడాన్ బేస్ ‘రైడర్' వేరియంట్ ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా ర్యాపిడ్ సెడాన్ మొత్తం ఐదు వేరియంట్లలో అందించబడుతుంది: రైడర్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో. టాప్-స్పెక్ స్కొడా రాపిడ్ మోంట్ కార్లో ధర రూ.11.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా)గా ఉంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

ఈ సెడాన్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, డార్క్ గ్రీన్ టింటెడ్ విండోస్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్, విండో లైన్‌పై క్రోమ్ గార్నిష్ వంటి మార్పులు ఉన్నాయి.

ఈ కారు లోపలివైపు గమనిస్తే, కొత్త స్కొడా రాపిడ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్కఫ్ ప్లేట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్రూయిజ్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

కొత్త రాపిడ్‌లోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఇబిడితో కూడిన ఏబిఎస్, రియర్‌వ్యూ కెమెరా మరియు సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్-వ్యూ మిర్రర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ విభాగంలోని ఇతర మోడళ్లన్నీ కూడా వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంటే, స్కొడా ర్యాపిడ్ మాత్రం కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ విడుదల తేదీ ఖరారు; బుకింగ్స్ ప్రారంభం

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల తేదీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలి కాలంలో దేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన కార్లను రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో స్టార్ట్/స్టాప్ డ్రైవ్ కోసం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 12, 2020, 11:58 [IST]
English summary
Skoda Auto has officially revealed the launch date for the Rapid TSI automatic variant. The automaker will be launching the sedan on September 17, 2020. Read in Telugu.
Read more on: #స్కొడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+