స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా ప్రజలకు ఇళ్లకే పరిమితమై, బయటకు రావటం మానేశారు (సామాజిక దూర ప్రమాణాలను పాటించడం కోసం), ఫలితంగా వారి వాహనాలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యాయి. ఇటీవలి లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో, ప్రజలు బయటకు రావటం, విధులకు వెళ్లటం చేస్తున్నారు.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

ప్రస్తుతం ఇది వర్షాకాలం మరియు వాహనాలు చాలా కాలంగా ఇళ్ల వద్దనే నిలిపి వేసి ఉంచడం వలన వాటిని ఉపయోగించడానికి ముందు ఓసారి సర్వీస్ చేయించుకోవటం లేదా తనిఖీ చేయించుకోవటం మంచిదని ఆటోమొబైల్ నిపుణలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో కూడా తమ కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ చెకప్ క్యాంప్‌ను ప్రారంభిచింది. లాక్‌డౌన్ కారణంగా ఈసారి సర్వీస్ క్యాంప్‌కి అధిక సంఖ్యలో కార్లు వస్తాయని భావిస్తున్నారు.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

మరి ఈ సర్వీస్ క్యాంప్‌లో ఏం చేయనున్నారు? ఈ సర్వీస్ క్యాంప్‌లో స్కోడా ఆటో తమ కస్టమర్లకు అనేక డిస్కౌంట్లు మరియు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. స్కోడా మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ జూలై 20 నుండి ప్రారంభమై 2020 ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. కస్టమర్ మరియు డీలర్ల మధ్య సామాజిక దూరాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసిన అన్ని నియమ నిబంధనలను కంపెనీ అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

ఈ సర్వీస్ క్యాంప్‌కు వచ్చే అన్ని స్కొడా కార్లకు 40 పాయింట్ల ఉచిత చెక్-అప్ చేస్తారు. అలాగే, ఎంపిక చేసిన కొన్ని విడిభాగాలపై, కస్టమర్లు 15 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్ కోసం కంపెనీ 20 శాతం మినహాయింపు కూడా అందిస్తోంది. జెర్మ్‌క్లీన్ ట్రీట్‌మెంట్ మరియు ఎసి యూనిట్ శానిటైజేషన్ ద్వారా కార్లను పూర్తిగా శుభ్రపరిచే ప్రక్రియను కూడా స్కొడా ఆఫర్ చేస్తోంది.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

స్కోడా ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే,, కంపెనీ ఇటీవలే స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ అనే కొత్త 1.0-లీటర్ టిఎస్ఐ వేరియంట్‌ని మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త స్కోడా రాపిడ్ ‘రైడర్ ప్లస్' వేరియంట్ నాలుగు కలర్ ఆప్షన్స్ (క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోఫీ బ్రౌన్)లో లభిస్తుంది.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం; ఫ్రీ కార్ చెకప్

స్కొడా మాన్‌సూన్ సర్వీస్ చెకప్ క్యాంప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రత్యేకించి వర్షాకాలంలో మీ వాహనాలను ఎప్పటికప్పుడు సర్వీస్ లేదా చెకప్ చేయించడం చాలా అవసరం. ఈ మాన్‌సూన్ సర్వీస్ చెక్-అప్ క్యాంప్ ద్వారా స్కొడా ఆటో తమ కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకొని, తమ కార్ల వర్షాకాలనికి సిద్ధంగా ఉంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 22, 2020, 11:36 [IST]
English summary
Skoda Auto has started its monsoon service check-up camp and this time there are more cars expected to come for the camp, due to the lockdown. Read in Telugu.
Read more on: #స్కొడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+