ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా ఆటో ఇండియా ఇండియన్ మార్కెట్లో తన ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 కారుని 2020 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఈ వాహనంకోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ స్కోడా ఆక్టావియా ధర రూ. 35.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). స్కోడా బుకింగ్స్ 1 లక్ష రూపాయనుండి ప్రారంభం అయ్యాయి.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

భారత మార్కెట్లో బుకింగ్ ప్రారంభించిన స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 కేవలం 200 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ నిర్దారించింది. కొత్త స్కోడా కారు 5 వేరియంట్ కలర్స్ తో లభించనుంది. అవి ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 కారు 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 242 బిహెచ్‌పి మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఏడు-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన ఈ మోడల్ 6.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్ చేయగలదు, ఎలక్ట్రానిక్ పరిమితమైన టాప్-స్పీడ్ 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 లో ఎయిర్-ఇన్లెట్స్, గ్రిల్, ఓఆర్వీఎమ్ లు, స్పాయిలర్ మరియు ట్రాపెజోయిడల్ టెయిల్ పైప్స్ వంటి గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్. క్వాడ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు 18-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా ఆక్టావియా మోడల్‌లోని భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ ఫ్రంట్ లైట్ సిస్టమ్, మెకానికల్ బ్రేక్ అసిస్ట్, మల్టీ కొలిషన్ బ్రేక్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటివి ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా యొక్క లోపలి భాగంలో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్‌లింక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, త్రి స్పోక్ ఫ్లాట్ బాటమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు RS లోగోతో బ్లాక్ అల్కాంటారా సీట్లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ "జాక్ హోలిస్" మాట్లాడుతూ ఆక్టేవియా ఆర్ఎస్ 245 భారతదేశంలో అత్యంత వేగవంతమైన స్కోడా బ్రాండ్ ఇదే అని, ఇది క్లాస్-లీడింగ్ సేఫ్టీ మరియు ఇంటెలిజెంట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు అధిక-పనితీరు గల ఇంజిన్, స్పోర్టి అప్పీరియన్స్ మరియు డైనమిక్ డ్రైవింగ్ సామర్ధ్యాలను కలిగి ఉంటుందన్నారు.

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245 : బుకింగ్స్ ఎప్పుడంటే.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండైన మార్కెట్లో విడుదల చేసిన స్కోడా ఆక్టావియా ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభించింది. దీనిని 1 లక్షరూపాయలతో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని స్కోడా కంపెనీ కల్పించింది. ఇప్పుడు ఇది కేవలం 200 యూనిట్లను మాత్రమే అమ్మకాలను జరపనుంది. మార్కెట్లో ఆటో ఔత్సాహికులను బట్టి మరిన్ని వాహనాలను ప్రవేశపెడుతుందని కూడా తెలియజేసింది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Octavia RS 245 bookings to open on 1 March. Read in Telugu.
Story first published: Friday, February 28, 2020, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X