బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

స్కోడా ఇండియా తన బ్రాండ్ అయిన బిఎస్-6 రాపిడ్ మోడల్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కొత్త బిఎస్ 6 స్కోడా రాపిడ్‌లో 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. స్కోడా రాపిడ్ 50 వేల రూపాయలకు బుకింగ్స్ ప్రారంభించింది. 2020 ఏప్రిల్ 14 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

కొత్త బిఎస్-6 స్కోడా రాపిడ్ 1.0 లీటర్ ఇంజిన్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే ప్రారంభంలో అందిస్తామని బెంగళూరుకు చెందిన డీలర్ ధృవీకరించారు. అయితే తరువాతి దశలో అప్సనల్ ఆటోమేటిక్ అందించబడుతుంది. అలాగే 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇకపై ఆఫర్‌లో ఉండే అవకాశం ఉండదు.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

బిఎస్-6 పోలో మరియు వెంటోలో ప్రవేశపెట్టిన మాదిరిగానే స్కోడా రాపిడ్ లో 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 110 బిహెచ్‌పి మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రాపిడ్‌కు కూడా పవర్ ఫిగర్స్ ఒకేలా ఉంటాయని ఆశించవచ్చు.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

ప్రస్తుతం అందిస్తున్న స్కోడా రాపిడ్ ఇంజిన్ 104 బిహెచ్‌పి మరియు 153 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.6-లీటర్ పెట్రోల్,ఇంజిన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న1.5-లీటర్ డీజిల్ యూనిట్ 109 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో అందించబడుతుంది, 1.5-లీటర్ డీజిల్ యూనిట్ ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఏడు-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

ప్రస్తుతం ఆఫర్‌లో ఉన్న అన్ని ఇంజన్లు మరియు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు బ్రాండ్ నుండి నిలిపివేయబడతాయి. బిఎస్ 6 సమ్మతి లేకపోవడం వల్ల 1.5 లీటర్ ముందుకు సాగదు. అయితే, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను వోక్స్ వ్యాగన్ వెంటోలో బిఎస్ 6 వెర్షన్ లో అందిస్తున్నారు.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

ఈ కొత్త స్కోడా రాపిడ్ లో ఒక్క ఇంజిన్ మాత్రమే కాకుండా ఈ మోడల్ లో పెద్దగా అదనపు మార్పులు కూడా జరగలేదనే చెప్పాలి. స్కోడా రాపిడ్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, గైడ్ లైన్స్ రియర్‌వ్యూ కెమెరా, మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉంటాయి.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

స్కోడా రాపిడ్ ఇండియన్ మార్కెట్లో వోక్స్ వ్యాగన్, మారుతి సుజుకి సియాజ్ మరియు రాబోయే 2020 హోండా సిటీకి ప్రత్యర్థిగా ఉంటుంది. 1.0-లీటర్ ఇంజిన్‌తో ఉన్నబిఎస్-6 స్కోడా రాపిడ్ ధర అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్ 6 స్కోడా రాపిడ్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

స్కోడా రాపిడ్ దాని కొత్త పవర్‌ట్రెయిన్‌తో మరింత సమర్థవంతంగా ఉంటుంది మరియు మంచి పనితీరుని కలిగి ఉంటుంది. ప్రస్తుత బిఎస్ 4 నుండి బిఎస్ 6 కి మారడంతో డీజిల్ ఇంజన్లకు డిమాండ్ తగ్గింది. ఎట్టకేలకు స్కోడా రాపిడ్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి డెలివరీ కానున్నాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Rapid BS6 Bookings Open: To Feature 1.0-Litre TSI Petrol Engine. Read in Telugu.
Story first published: Thursday, March 19, 2020, 11:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more