Just In
- 9 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 10 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 13 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 13 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Lifestyle
మీకు సంతానం కలగకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను లాంచ్ చేసిన సోనాలికా ; ధర & వివరాలు
ప్రముఖ ట్రాక్టర్ తయారీదారు సోనాలికా ట్రాక్టర్ భారతదేశపు మొదటి ఫీల్డ్ రెడీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సోనాలికా టైగర్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సోనాలికా టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఐరోపాలో రూపకల్పన చేయబడి భారతదేశంలో అభివృద్ధి చేయబడి తయారవుతుందని చెబుతారు.

టైగర్ ఎలక్ట్రిక్ కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు సోనాలికా గ్రూప్ ప్రకటించింది. వినియోగదారులు భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. దీని డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు.

నివేదికల ప్రకారం టైగర్ ఎలక్ట్రిక్‌లో అత్యాధునిక ఐపి 67 కంప్లైంట్ 25.5 కిలోవాట్ల నాచురల్లీ కూలింగ్ శీతలీకరణ కాంపాక్ట్ బ్యాటరీ ఉంది. సోనాలికా టైగర్ ఎలక్ట్రిక్‌లోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గంటకు 24.9 కి.మీ వేగంతో పనిచేస్తుందని తెలిపారు.
MOST READ:బెంగుళూరుకి బై బై చెప్పి, తమిళనాడుకి హాయ్ హాయ్ చెప్పిన ఏథర్ ఎనర్జీ!

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సాధారణ ట్రాక్టర్ లో ఉంపయోగించే ఖర్చుతో పోలిస్తే దాదాపు నాలుగవ వంతు మాత్రమే ఖర్చవుతుంది. సోనాలికా టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను హోమ్ ఛార్జింగ్ పాయింట్ నుండి ఛార్జ్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటలు పడుతుంది. ఈ ట్రాక్టర్ జర్మనీలో రూపొందించిన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది, ఇది అన్ని సమయాల్లో 100 శాతం టార్క్ అందిస్తుంది.
MOST READ:సినిమాను సైతం తలదన్నే వోల్వో కొత్త ట్రక్ వీడియో.. చూసారా ?

ఈ ట్రాక్టర్ గురించి సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో భారతదేశం మరింత ముందుకు సాగాలని దాని కోసం ఈ కొత్త శక్తివంతమైన సోనాలికా ఫీల్డ్ రెడీ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించబడింది తెలిపారు.

2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలకు అనుగుణంగా మేము పని చేస్తున్నామని కూడా అయన అన్నారు. టైగర్ ఎలక్ట్రిక్ రైతులకు మంచి సౌకర్యాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది రైతులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
MOST READ:ప్రపంచంలోనే పురాతన కార్ల తయారీ సంస్థలు ఏవో మీకు తెలుసా.. అయితే ఇది మీకోసమే

ఇంజిన్ నుండి ఎక్కువ వేడి రావడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇందులో దీనికి అనుకూలంగా ఉండే బ్యాటరీలు ఉపయోగించబడ్డాయి. అది మాత్రమే కాకుండా ఈ ట్రాక్టర్‌లో డీజిల్ ఇంజన్ లేకపోవడం వల్ల, వైబ్రేషన్ కూడా తగ్గుతుంది. నిర్వహణ ఖర్చు కూడా దాదాపు చాల వరకు తక్కువగా ఉంటుంది.

సోనాలికా టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క ట్రాలీ 2 టన్నుల బరువును సులభంగా లాగగలదని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, దీని గరిష్ట వేగం 24.93 కిలోమీటర్లు మరియు దాని బ్యాటరీ 8 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. ఏది ఏమైనా దేశం ప్రగతి వైపు నడుస్తున్న క్రమంలో అన్నదాతకు కూడా అనుకూలంగా ఉండే విధంగా సోనాలికా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించడం నిజంగా అభినందనీయం.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !