లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

సోనాలికా ట్రాక్టర్స్ తన మే నెల యొక్క అమ్మకాల నివేదికను విడుదల చేసింది. మే నెలలో మొత్తం 9,177 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయని కంపెనీ తన నివేదికలో ప్రకటించింది. 2019 మే నెల్తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ట్రాక్టర్ల అమ్మకాలు 18.6% పెరిగాయి.

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

మే 2019 లో కంపెనీ 7,737 ట్రాక్టర్లను దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లలో విక్రయించింది. ఋతుపవనాల ప్రారంభంతో దేశవ్యాప్తంగా వరి విత్తనాలు ప్రారంభమయ్యాయి. దీనివల్ల ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది అని కంపెనీ తెలిపింది.

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

ట్రాక్టర్లకు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఇతర వ్యవసాయ పరికరాలకు డిమాండ్ పెరిగింది. మే నెలలో కంపెనీ 1,537 ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. లాక్ డౌన్ తరువాత, కంపెనీ మే నెలలో 85% నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించింది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ల కోసం వోక్స్‌వ్యాగన్ కొత్త స్కీమ్

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

జూన్ లో 100% తిరిగి ఆపరేషన్ ప్రారంభమైంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లలో కంపెనీ తన షోరూమ్‌లను ఓపెన్ చేస్తుంది. ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాల తయారీలో ప్రముఖమైన మహీంద్రా మే నెలలో ట్రాక్టర్ అమ్మకాలలో 2% పెరుగుదల నివేదించింది.

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

మహీంద్రా ఈ ఏడాది మే నెలలో మొత్తం 24,017 ట్రాక్టర్లను విక్రయించింది. గత ఏడాది మే 2019 లో 23,539 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. మీరు ఈ గణాంకాలను పరిశీలిస్తే, లాక్ డౌన్ తర్వాత కూడా వ్యవసాయ వాహనాల అమ్మకాలు మెరుగుపడ్డాయని ఇక్కడ చూడవచ్చు.

MOST READ:70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

కారు అమ్మకాలు మాత్రం లాక్‌డౌన్ లో 80 నుంచి 90% వరకు తగ్గాయి. కానీ ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి. మహీంద్రా ట్రాక్టర్ ఎగుమతులు తగ్గాయి, అయితే రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది మే నెలలో 324 ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. మే 2019 లో కంపెనీ 1165 ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు దాదాపు 72% తగ్గాయి.

MOST READ:నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి

Most Read Articles

English summary
Sonalika Tractor sales May registers 18 percent growth midst lockdown. Read in Telugu.
Story first published: Friday, June 5, 2020, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X