190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

భారతదేశంలో అవయవ దాతల సంఖ్య పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఒక సంఘటన మళ్ళీ నిరూపించబడింది. ప్రమాదంలో మరణించిన యువతి లివర్ మరొక వ్యక్తికి అంటుకుంది.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

మనం బ్రతికున్నప్పుడే కాదు మనం చనిపోయిన తరువాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలని చాల మంది ప్రజలు అవయవదాతలుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో అవయవ దాతల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

ఈ మధ్యకాలంలో చాల మంది కొన్ని ప్రమాదాలలో మరణించడం వల్ల వారి అవయవాలను ఇతరులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా ఉపయోగించడం వల్ల వ్యక్తి మరణించిన అతని అవయవాలు బ్రతికే ఉంటాయి. ఈ నేపధ్యలో ఇటీవల జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి చూద్దాం..

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

ఇటీవల కాలంలో తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల యువతి చనిపోయింది. చనిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

తమిళనాడు తంజావూరులో చనిపోయిన యువతీ లివర్, మదురైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి కాలేయ మార్పిడి అవసరం ఉంది. చనిపోయిన యువతి లివర్‌ను తంజావూరు నుంచి మదురైకి అంబులెన్స్‌లో రోడ్డు మార్గంలో రవాణా చేశారు.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో డ్రైవింగ్ చేయడం కష్టమైన పని అయినప్పటికీ అంబులెన్సు డ్రైవర్ సుబ్రమణియన్ చాలా నైపుణ్యంతో తాజావూరు నుంచి మధురైకి దాదాపు 190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాలలో చేరుకొని విజవంతంగా లివర్ మార్పిడికి దోహదం చేసాడు.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

190 కిలోమీటర్లు ప్రయాణించిన సరైన సమయానికి చేరుకున్న అంబులెన్సు డ్రైవర్ సుబ్రమణియన్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. దీని గురించి సుబ్రమణియన్ మాటాడుతూ ఈ విధంగా సహాయపడటానికి ప్రజల సహకారం మరియు ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందని అన్నారు.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

190 కిలోమీటర్లు ప్రయాణం గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల సరైన సమయానికి గమ్యాన్ని చేరుకోగలిగానని చెప్పారు. అంతే కాకుండా సుబ్రమణియన్, "ప్రాణాలను కాపాడటానికి నేను అంబులెన్స్‌ను జాగ్రత్తగా నడుపుతున్నాను" అని అన్నారు. అంబులెన్సులు ఎందుకు వేగంగా కదులుతున్నాయో అర్థం చేసుకున్న ప్రజలు కూడా సహాయం చేశారన్నారు.

190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్

ఇటీవల కర్ణాటకలోని ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు అంబులెన్స్‌లను వేగంగా నడపగలిగారు మరియు బాధితులకు సకాలంలో చికిత్స చేయగలిగారు. అంబులెన్స్‌లకు మార్గం చూపే ఎవరైనా మరొకరి జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఇది ప్రశంసించాల్సిన విషయం.

Most Read Articles

English summary
Tamil Nadu Ambulance driver covered 190 kms in 1 hour 50 minutes to save a patients life. Read in Telugu.
Story first published: Wednesday, March 4, 2020, 17:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X