టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా మోటార్స్ తమ తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కారును జనవరి 22, 2020న ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. విడుదలకు ముందే కార్ల సేఫ్టీని పరీక్షించే గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో ఆల్ట్రోజ్ కారుకు క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో టాటా ఆల్ట్రోజ్ అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని అత్యంత సురక్షితమైన కారుగా 5-స్టార్ రేటింగ్‌ దక్కించుకుంది.

గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షల్లో టాటా ఆల్ట్రోజ్‌కు సైడ్-ఇంపాక్ట్ (ఇరువైపులా) మరియు ఫ్రంట్-ఆఫ్‌సెట్(ముందు ముందు) క్రాష్ టెస్ట్ నిర్వహించారు. బలమైన ఫోర్స్‌‌తో ఢీకొట్టి క్రాష్ టెస్ట్ జరిపారు. ఈ పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా 17కు గాను 16.3 పాయింట్లు సాధించింది.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా ఆల్ట్రోజ్ కారులో చిన్న పిల్లల సేఫ్టీ పరంగా దాదాపు 3-స్టార్ రేటింగ్ దక్కించుకుంది. వెనుక సీటులో ప్రయాణించే చిన్న పిల్లల సేఫ్టీ టెస్టులో 49కి గాను 29 పాయింట్లే సాధించింది. క్రాష్ టెస్టు జరిపినపుడు చిన్న పిల్లల సీటును ఫిక్స్ చేసేందుకు ఉపయోగించే ఐఎస్ఒఫిక్స్ యాంకర్స్ కాస్త వదులు కావడంతో ఈ కెటగిరీలో తక్కువ రేటింగ్ పొందింది.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో దాదాపు అన్ని సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి. ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్-బెల్ట్ రిమైండర్లు, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, హై-స్పీడ్ వార్నింగ్ ఇంకా ఎన్నో అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా కంపెనీ ఆవిష్కరించిన "ఆల్ఫా" ఆర్కిటెక్చర్ ఆధారంగా వచ్చిన తొలి మోడల్ టాటా ఆల్ట్రోజ్. మునుపటి ఫాట్‌ఫామ్‌తో పోల్చుకుంటే "ఆల్ఫా" లైట్ వెయిట్ ఫ్లాట్‌ఫామ్. సరికొత్త "ఆల్ఫా" ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద వచ్చే కార్లలో పాదచారుల (పెడస్ట్రైన్స్) భద్రతను తప్పనిసరిగా అందిస్తోంది. అదే విధంగా టాటా ఆవిష్కరించిన ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తోన్న రెండో మోడల్ టాటా ఆల్ట్రోజ్ కాగా మొదటిది టాటా హ్యారియర్ ఎస్‌యూవీ.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

అంతర్జాతీయ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన రెండవ మేడిన్ ఇండియా కారు టాటా ఆల్ట్రోజ్. ఫస్ట్ మోడల్ కూడా టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ ఎస్‌యూవీ కావడం గమనార్హం. గ్లోబల్ NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం)లో 5-స్టార్ రేటింగ్ పొందిన కార్లను అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించుకోవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా ఆల్ట్రోజ్ పూర్తి స్థాయిలో విడుదలైతే రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి, 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ (85బిహెచ్‌‌పి పవర్-113ఎన్ఎమ్ టార్క్) మరియు 1.5-లీటర్ కెపాసిటీ గల డీజల్ ఇంజన్ (90బిహెచ్‌పి-200ఎన్ఎమ్). రెండు ఇంజన్‌లు బిఎస్6 ప్రమాణాలను పాటిస్తాయి.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లు కూడా ప్రస్తుతానికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించనున్నాయి. త్వరలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా పరిచయం చేస్తామని టాటా మోటార్స్ ఇది వరకే తెలిపింది.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

ప్రీమియం హ్యాచ్‌‌బ్యాక్ సెగ్మెంట్లోకి అతి త్వరలో విడుదల కానున్న టాటా ఆల్ట్రోజ్ కూడా సేఫ్టీ పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ దక్కించుకుని అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. సుమారు 5 లక్షల బడ్జెట్ ధరలో రానున్న టాటా ఆల్ట్రోజ్ మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్! (వీడియో)

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎన్నో ఏళ్ల పాటు సేల్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టాటా ఇప్పుడు మార్కెట్ లీడర్‌గా అవతరిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్, ఇంపాక్ట్ 1.0 మరియు ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా తీసుకొచ్చిన కొత్త కార్లు మార్కెట్‌ను దున్నేస్తున్నాయి.

అత్యంత సరసమైన ధరలో, అత్యాధునిక డిజైన్ మరియు అత్యుత్తమ సేఫ్టీతో వస్తోన్నన టాటా కార్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన మేడిన్ ఇండియా కార్లు రెండే కాగా.. ఆ రెండూ కూడా టాటా కార్లే కావడంతో టాటా కస్టమర్ల సేఫ్టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Most Read Articles

English summary
Tata Altroz Secures Five-Star Rating At Global NCAP Crash Tests: Check Out The Test Video Here!. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X