టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు టాటా మోటార్స్ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. 'మీ శాంటా ఆల్ట్రోజ్, త్వరలో వస్తుంది' అనే ట్యాగ్‌తో టాటా మోటార్స్ ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది.

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

డిసెంబర్ 15, 2020వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు టాటా మోటార్స్ ఈ కొత్త ఆల్ట్రోజ్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తమ సోషల్ మీడియా పేజీలలో ప్రకటించింది. ఈ కొత్త ఆల్ట్రోజ్ వేరియంట్‌కు సంబంధించిన టీజర్‌లో ఆవిష్కరణ (లాంచ్) తేదీ, సమయం తప్ప కంపెనీ మరే ఇతర వివరాలను వెల్లడించలేదు.

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ నుండి రానున్న కొత్త ఆల్ట్రోజ్ వేరియంట్ ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో టాటా మోటార్స్ ఈ కారులో టర్బో వేరియంట్‌ను తీసుకురావచ్చనే వదంతులు వినిపించాయి. బహుశా కంపెనీ ఈ రూమర్లను నిజం చేస్తూ ఇందులో టర్బో వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

మరోవైపు ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ విడుదల కావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను క్రిస్మస్ ముందు విడుదుల చేస్తున్న నేపథ్యంలో, ఇదొక స్పెషడ్ ఎడిషన్ మోడల్‌గా ఉంటుందనేది మా అభిప్రాయం. ఈ టీజర్‌లోని హ్యాచ్‌బ్యాక్‌పై రెడ్ పెయింట్ స్కీమ్ మరియు అంతటా ‘శాంటా' రెఫరెన్సులు కనిపిస్తాయి. వీటిని బట్టి చూస్తే, ఇది స్పెషల్ ఎడిషన్ అని అర్థమవుతుంది. మరిం ఈ రెండింటిలో ఏది నిజమనేది రేపు మధ్యాహ్నం నాటికి తెలిసిపోనుంది.

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

ఒకవేళ టాటా మోటార్స్ స్పెషల్ ఎడిషన్ టాటా ఆల్ట్రోజ్‌ను తీసుకువచ్చినట్లయితే, దీనిని స్టాండర్డ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని అదే ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో విడుదల చేసే అవకాశం ఉంది. స్టాండర్డ్ టాటా ఆల్ట్రోజ్ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

ఇందులోని పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని మరియు 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని మరియు 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

ఇటీవలి రూమర్ల ప్రకారం, టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను టర్బో పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేయవచ్చనే వార్తలు ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త టాటా ఆల్ట్రోజ్ వేరియంట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఇంజన్ సుమారు 108 బిహెచ్‌పిల శక్తిని మరియు 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ కోసం టీజర్; ఏమై ఉండొచ్చు?

ప్రస్తుతం, మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.00 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఒకవేళ కొత్త టర్బో వేరియంట్ మార్కెట్లో విడుదలైనట్లయితే, దీని ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్)కు ఎగువన ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Tata Altroz New Variant Teased Ahead Of Launch; Might Be A Special Edition. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X