టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో ఓ కొత్త పవర్‌ఫుల్ టర్బో వేరియంట్ రానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌కు సంబంధించిన ఇంజన్ వివరాలు మరియు అంచనా ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

టీమ్‌బిహెచ్‌పిలో విడుదలైన సమాచారం ప్రకారం, కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో ఉపయోగించిన ఇంజన్ వివరాలను తెలియజేసే బ్రోచర్ ఒకటి లీక్ అయింది. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో శక్తివంతమైన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

ఈ బ్రోచర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ధరలు కూడా లీక్ అయ్యాయి. అందులో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ టర్బో వేరియంట్ ధరలు రూ.7.99 లక్షల నుండి రూ.8.75 లక్షల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:సినీతారలను వెంబడించిన మీడియాపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా ?

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

అలాగే, టాటా ఆల్ట్రోజ్ టర్బో వెర్షన్ మొత్తం నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి మరియు ఎక్స్‌జెడ్) లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ.5.44 లక్షల నుండి రూ.7.89 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

ప్రస్తుతం దేశీయ విపణిలో టాటా ఆల్ట్రోజ్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. అందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 85 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది 89 బిహెచ్‌పి పవర్‌ని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ప్రస్తుతాని టాటా ఆల్ట్రోజ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను ఆప్షన్ అందుబాటులో లేదు. అయితే, కొత్తగా వచ్చే ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌తో పోలిస్తే, టర్బో వేరియంట్‌ను కాస్తంత భిన్నంగా చూపించేందుకు కంపెనీ దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్పులు, జేటిపి మోడళ్ల కోసం టాటా మోటార్స్ చేసిన మార్పుల మాదిరిగా ఉండొచ్చని అంచనా.

MOST READ:కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదల కానున్న కెటిఎం ఆర్‌సి 200 బైక్

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

స్టాండర్డ్ టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో తమ ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. టాటా ఆల్ట్రోజ్ టర్బో భారత మార్కెట్లో ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు రాబోయే నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ20 మోడళ్లతో పోటీ పడనుంది.

MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలు లీక్!

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ఇంజన్ స్పెక్స్ మరియు ధరలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ఈ ఏడాది దీపావళి నాటి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో టర్బో వేరియంట్ ఆల్ట్రోజ్ కారును ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ కొత్త వేరియంట్ బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచగలదని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Tata Altroz will be reciving a new turbo-petrol engine in the Indian market. Ahead of its launch, several details of the upcoming Altroz have been revealed including complete specs of the all-new engine on the premium hatchback. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X