టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో కంపెనీ ఓ కొత్త పవర్‌ఫుల్ టర్బో వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో అని పిలువబడే కొత్త వేరియంట్‌ను టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. రష్‌లేన్ విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, మహారాష్ట్ర టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న బ్లూకలర్ ఆల్ట్రోజ్ కారును టాటా మోటార్స్ క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

కారు వెనుక భాగంలో క్రోమ్ లెటర్స్‌తో టర్బో అనే లేబుల్ కూడా ఉంటుంది. ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేయడాన్ని చూస్తుంటే, ఇందులో డిజైన్ పరంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బిఎస్ ఆల్ట్రోజ్‌కి ఈ టర్బో వేరియంట్‌కు ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. కేవలం ఇంజన్ మార్పు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్లో శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే ఇంజన్‌ను కంపెనీ విక్రయిస్తున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇంజన్ ఒకటే అయినప్పటికీ, టాటా ఆల్ట్రోజ్ కోసం ఇందులోని గణాంకాలను కొంచెం ట్యూన్ చేసే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 1.2-లీటర్ ఇంజన్ ఇప్పటికే బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడినది. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ నుండి 4000 ఆర్‌పిఎమ్ మధ్యలో 170 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:బిఎస్ 6 హోండా యునికార్న్ ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో తెలుసా?

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

టాటా మోటార్స్ ఇందుకు ప్రత్యామ్నాయంగా, టాటా జెటిపి మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌ను కూడా కొత్త ఆల్ట్రోజ్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, ఈ ఇంజన్ ఇప్పటికీ ఇంకా బిఎస్4 కంప్లైంట్‌గానే ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక ఇంజన్‌ను కొత్త టాటా ఆల్ట్రోజ్ బిఎస్‌6లో ఉపయోగించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను ఆప్షనల్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటుగా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుందని అంచనా. దీనికి అదనంగా, కొత్త ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో మరింత స్పోర్టీ డ్రైవ్ అనుభూతి కోసం పాడిల్ షిఫ్టర్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌తో పోలిస్తే, టర్బో వేరియంట్‌ను కాస్తంత భిన్నంగా చూపించేందుకు కంపెనీ దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్పులు, జేటిపి మోడళ్ల కోసం టాటా మోటార్స్ చేసిన మార్పుల మాదిరిగా ఉండొచ్చని అంచనా.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ప్రస్తుతం దేశీయ విపణిలో టాటా ఆల్ట్రోజ్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. అందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 85 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది 89 బిహెచ్‌పి పవర్‌ని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన మహీంద్రా థార్ : వివరాలు

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ప్రస్తుతాని టాటా ఆల్ట్రోజ్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షన్ అందుబాటులో లేదు. అయితే, కొత్త వచ్చే ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ టర్బో మార్కెట్లో విడుదలైతే, ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు రాబోయే నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ20 మోడళ్లతో పోటీ పడనుంది. ధర విషయానికి వస్తే, కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బోను టాప్-ఆఫ్ ది లైన్ వేరింయట్‌గా విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి, మార్కెట్లో దీని ధర కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా కొత్త ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, ఇది మార్కెట్లోకి విడుదల కావటానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బిఎస్6 ఉద్గార నిబంధనలు కఠినతరం అయ్యాక, భారత మార్కెట్లో టర్బో-పెట్రోల్ ఇంజన్లు బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన టర్బో వేరియంట్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ విభంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ రానున్నట్లు తెలుస్తోంది.

Sorce:Rushlane

Most Read Articles

English summary
Tata Motors will be introducing a new powerful variant of the Altroz hatchback in the Indian market. Called the Altroz Turbo, it is expected to arrive sometime during the festive season this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X