టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ డీటేల్స్ లీక్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో ఓ కొత్త పవర్‌ఫుల్ టర్బో వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో అని పిలువబడే ఈ కొత్త వేరియంట్‌ను టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాటా మోటార్స్ ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా కార్‌దేఖో లీక్ చేసిన సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ ఇప్పటికే తమ ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్‌ను ఆర్టీఓలో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి.

టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో తమ ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. ఆ సమయంలో కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఏదేమైనప్పటికీ, ఇండియన్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ టర్బో ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీని టార్క్ గణాంకాలు ఇంకా వెల్లడి కాలేదు, అయితే ఇది 140 ఎన్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా.

గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ టర్బో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మాన్యువల్ వేరియంట్‌లో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ యూనిట్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లో డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) ఉండొచ్చని తెలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో స్పోర్టీ అనుభూతిని పెంచేందుకు ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉండనున్నాయి.

బహుశా ఈ ఇంజన్ నిలిపివేయబడిన టాటా జెటిపి మోడళ్ల నుండి సేకరించినది కావచ్చు. అయితే, ఈ ఇంజన్ ఇప్పటికీ ఇంకా బిఎస్4 కంప్లైంట్‌గానే ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక ఇంజన్‌ను కొత్త టాటా ఆల్ట్రోజ్ బిఎస్6లో ఉపయోగించే అవకాశం ఉంది. బిఎస్6 ఇంజన్ 108 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం.

స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌తో పోలిస్తే, టర్బో వేరియంట్‌ను కాస్తంత భిన్నంగా చూపించేందుకు కంపెనీ దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్పులు, జేటిపి మోడళ్ల కోసం టాటా మోటార్స్ చేసిన మార్పుల మాదిరిగా ఉండొచ్చని అంచనా.

ప్రస్తుతం దేశీయ విపణిలో టాటా ఆల్ట్రోజ్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. అందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 85 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది 89 బిహెచ్‌పి పవర్‌ని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ప్రస్తుతాని టాటా ఆల్ట్రోజ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆప్షన్ అందుబాటులో లేదు. అయితే, కొత్తగా వచ్చే ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో మార్కెట్లో విడుదలైతే, ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు రాబోయే నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ20 మోడళ్లతో పోటీ పడనుంది. ధర విషయానికి వస్తే, కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బోను టాప్-ఆఫ్ ది లైన్ వేరింయట్‌గా విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి, మార్కెట్లో దీని ధర కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత పండుగ సీజన్‌లో టర్బో వేరియంట్ ఆల్ట్రోజ్ కారును ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ కొత్త వేరియంట్ బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచుకునేందుక మరియు మునుపటి ఆర్థిక సంవత్సరంలో అనుభవించిన భారీ మందగమనం నుండి కంపెనీని బయటపడేసేందుకు సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications