టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గత కొంత కాలంగా గ్రావిటాస్ అనే ఓ ఫుల్ సైజ్ ఎస్‌యూవీపై పనిచేస్తున్న సంగతి తెలిసినదే. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తొలిసారిగా తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుండి ఈ మోడల్‌పై భారీ హైప్ నెలకొంది.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రావిటాస్' ఫుల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి తాజాగా కొన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి. అదుగో ఇదుగో అంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న టాటా గ్రావిటాస్, ఇప్పట్లో మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

వాస్తవానికి టాటా గ్రావిటాస్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో మార్కెట్లో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ, ఇది వచ్చే ఏడాది వరకూ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆటో కార్ ఇండియా నుండి వచ్చిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు.

MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

తాజా నివేదికల ప్రకారం, టాటా గ్రావిటాస్ విడుదలలో ఆలస్యానికి ప్రధానంగా దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు ఆ తర్వాతి లాక్డౌన్ వలన ఏర్పడి పరిస్థితులే కారణంగా చెప్పుకోవచ్చు. దేశంలో మూడు నెలలకు పైగా కొనసాగిన లాక్డౌన్ వలన కంపెనీ సప్లయ్ చైన్ దెబ్బతినింది, ఫలితంగా గ్రావిటాస్ అభివృద్ధి/తయారీలో కూడా జాప్యం జరిగింది.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

ప్రస్తుతం టాటా అందిస్తున్న హారియర్ మోడల్‌కు ఎగువన టాటా గ్రావిటాస్‌ను ప్రవేశపెట్టనున్నారు. గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా మారనుంది. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నట్లుగానే, టాటా హారియర్ ఎస్‌యూవీకి పొడగించిన సెవన్ సీటర్ వెర్షనే ఈ కొత్త టాటా గ్రావిటాస్.

MOST READ:ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

హారియర్ కంటే గ్రావిటాస్ 63 మి.మీ ఎక్కువ పొడవును మరియు 80 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. అయితే, వీల్‌బేస్ మాత్రం ఈ రెండు మోడళ్లలో ఒకేలా (2741 మి.మీ) ఉంటుంది. పొడగించిన కొలతల కారణంగా, టాటా గ్రావిటాస్‌లో ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. మూడవ వరుసలోని ప్రయాణీకులకు మరింత హెడ్‌రూమ్ ఉండేలా వెనుక డిజైన్‌లో కూడా మార్పులు చేశారు.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

హారియర్ మరియు గ్రావిటాస్ మోడళ్లకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసేందుకు దీని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. అయితే, ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా పలు ఇతర ఫీచర్లను హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించనున్నారు. కానీ, దీని టెయిల్-ల్యాంప్స్ డిజైన్ మాత్రం కాస్తం రివైజ్ చేసినట్లుగా సమాచారం.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

టాటా హారియర్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా వస్తున్న గ్రావిటాస్‌లో హారియర్‌లో కనిపించే టెక్నాలజీ, పరికరాలు దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కాకపోతే, టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ త్రీ రో సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో విభిన్నమైన సీటింగ్ లేఅవుట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

టాటా గ్రావిటాస్‌లో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్, ఇరువైపులా అనలాగ్ డయల్స్‌తో కూడిన మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ స్టాక్ మరియు డ్రైవ్ మోడ్ సెలక్షన్ కోసం రోటరీ డయల్ వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

ఇకపోతే గ్రావిటాస్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా హారియర్ ఎస్‌యూవీ నుండి తీసుకోబడతాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎస్‌యూవీని పొడగించిన కారణంగా పెరిగిన అదనపు బరువుకు తోడ్పడేందుకు వీలుగా గ్రావిటాస్‌లోని ఇంజన్‌ను కొంచెం ఎక్కువ స్టేట్ ట్యూన్‌తో ఆఫర్ చేయవచ్చని అంచనా.

టాటా అభిమానులకు షాక్.. గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలలో జాప్యం

టాటా గ్రావిటాస్ విడుదల ఆలస్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా గ్రావిటాస్ భారత మార్కెట్లో ఈ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటి. గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tata Gravitas SUV was initially expected to go on sale sometime during this year's festive period. However, the launch of the SUV has now been delayed to early-2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X