క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో గ్రావిటాస్ పేరిట ఓ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలసినదే. టాటా గ్రావిటాస్‌ను కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇప్పటి వరకూ క్యామోఫ్లేజ్‌తో కూడిన గ్రావిటాస్ టెస్టింగ్ వాహనాలను మనం ఇదివరకటి కథనాల్లో చూశాం.

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

మొదటిసారిగా ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తున్న టాటా గ్రావిటాస్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు. భరత్ వంగూరి అనే ఇంటర్నెట్ యూజర్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తున్న ఓ బ్లూ కలర్ టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని ఇందులో గమనించవచ్చు.

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తొలిసారిగా తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుండి ఈ మోడల్‌పై భారీ హైప్ నెలకొంది. గ్రావిటాస్, హారియర్ కంటే గ్రావిటాస్ 63 మి.మీ ఎక్కువ పొడవును మరియు 80 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కెమెరాకి చిక్కిన కొత్త మహీంద్రా స్కార్పియో

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

ఈ పొడగించిన కొలతల కారణంగా, టాటా గ్రావిటాస్‌లో ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఫలితంగా, మూడవ వరుసలోని ప్రయాణీకులకు మరింత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇందుకు తగినట్లుగా కంపెనీ దీని వెనుక డిజైన్‌లో భారీ మార్పులు చేసింది. అయితే, ఈ రెండు మోడళ్ల వీల్‌బేస్ మాత్రం ఒకేలా (2741 మి.మీ) ఉంటుందని సమాచారం.

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి టాటా గ్రావిటాస్‌ను ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, ఇది ఆలస్యం అయింది.

MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

కాగా, టాటా మోటార్స్ ఇప్పుడు గ్రావిటాస్ విషయంలో తన ప్రణాళికలను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఇది కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాటా అందిస్తున్న హారియర్ మోడల్‌కు ఎగువన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా గ్రావిటాస్‌ను ప్రవేశపెట్టనున్నారు.

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

అయితే, హారియర్ మరియు గ్రావిటాస్ మోడళ్లకు మధ్య తేడాను తెలియజేసేందుకు కంపెనీ గ్రావిటాస్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌లో మార్పులు చేసింది. అయితే, ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా పలు ఇతర ఫీచర్లను హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించనున్నారు. కానీ, దీని టెయిల్-ల్యాంప్స్ డిజైన్ మాత్రం కాస్తంత రివైజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

టాటా హారియర్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా వస్తున్న గ్రావిటాస్‌లో హారియర్‌లో కనిపించే టెక్నాలజీ, పరికరాలు దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కాకపోతే, టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ త్రీ రో సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో విభిన్నమైన సీటింగ్ లేఅవుట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా హారియర్ ఎస్‌యూవీ నుండి తీసుకోబడతాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

క్యామోఫ్లేజ్ లేకుండా టాటా గ్రావిటాస్ టెస్టింగ్; త్వరలోనే రానుందా?

టాటా గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Image Courtesy: Bharath Vanguri

Most Read Articles

English summary
Tata Gravitas SUV Spotted Again While Testing In India, New Details Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X