టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సరికొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ అప్పట్లో మంచి హైప్ తెచ్చుకున్న సంగతి తెలిసినదే. టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో గ్రావిటాస్ కూడా ఒకటి.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానున్న టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన కొత్త వివరాలు, స్పై చిత్రాలు మరోసారి ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ చిత్రాలను చూస్తుంటే, టాటా గ్రావిటాస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

తాజాగా, రష్లేన్ విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని తమ కెమెరాలో బంధించారు. ఇందులో కొత్త 9-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను, వెనుక బంపర్‌లోని చంకీ బ్లాక్ కలర్ బాడీ క్లాడింగ్‌ను మనం గమనించవచ్చు. బహుశా ఇవి 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ అయి ఉండొచ్చు, టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభించవచ్చు.

MOST READ:భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో లాంచ్ డీటైల్స్

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లలో ఉపయోగించే 10-స్పోక్ వీల్స్ నుండి స్పూర్తి పొంది ఈ 9-స్పీక్ వీల్స్‌ను తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. ఇవి ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్‌ని జోడించే అవకాశం ఉంది. ఇదివరకు టెస్టింగ్ దశల్లో కనిపించిన గ్రావిటాస్ వాహనాల్లో 5-స్పోక్, 6-స్పోక్ డ్యూయెల్ టోన్ చక్రాలను ఉపయోగించారు.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

టాటా హారియర్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి టాటా గ్రావిటాస్‌ను తయారు చేశారు, కాబట్టి ఇది చూడటానికి టాటా హారియర్‌కు పొడగించిన వెర్షన్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే, రెండు మోడళ్ల మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి. ప్రధానంగా, గ్రావిటాస్ వెలుపల, స్టాండర్డ్ ఎస్‌యూవీ (హారియర్)లో కనిపించే విధంగా స్వూపింగ్ రూఫ్‌లైన్ ఉండదు.

MOST READ:టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

అలాగే, ఇందులో మూడవ వరుస ప్రయాణీకులకు ఎక్కువ హెడ్‌రూమ్ ఉండేలా వెనుక డిజైన్‌లో మార్పు చేశారు. గ్రావిటాస్ ఎస్‌యూవీ స్టాండర్డ్ హారియర్ కంటే 62 మి.మీ ఎక్కువ పొడవు ఉంటుంది. ఫలితంగా, లోపలి భాగంలో ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా పలు ఇతర ఫీచర్లను హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించనున్నారు. అయితే, దీని టెయిల్-ల్యాంప్స్ డిజైన్ మాత్రం రివైజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

ఇదివరకు లీకైన టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ చిత్రాల ప్రకారం, డాష్‌బోర్డ్‌పై ఉడ్ ట్రిమ్‌తో ప్రీమియం ఓక్ బ్రౌన్ ఇంటీరియర్‌ థీమ్‌తో దీనిని డిజైన్ చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేసే 8.8 ఇంచ్ సెంట్రల్ మౌంటెడ్ టచ్‌స్క్రీన్ యూనిట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

ఇకపోతే గ్రావిటాస్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా హారియర్ ఎస్‌యూవీ నుండి తీసుకోబడతాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎస్‌యూవీని పొడగించిన కారణంగా పెరిగిన అదనపు బరువుకు తోడ్పడేందుకు వీలుగా గ్రావిటాస్‌లోని ఇంజన్‌ను కొంచెం ఎక్కువ స్టేట్ ట్యూన్‌తో ఆఫర్ చేయవచ్చని అంచనా.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

టాటా గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యువి500 మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ విభాగంలో హ్యుందాయ్, కియా మరియు జీప్ బ్రాండ్‌లు కూడా మరికొన్ని త్రీ-రో సీటింగ్ ఎస్‌యూవీలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కిన టాటా గ్రావిటాస్; ఈసారి కొత్త అల్లాయ్ వీల్స్‌తో..

టాటా గ్రావిటాస్ స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా గ్రావిటాస్ టెస్టింగ్ వాహనాల్లో ఇప్పటి వరకూ ఉపయోగించిన అల్లాయ్ వీల్స్ డిజైన్లను గమనిస్తే, కంపెనీ ఈ మోడల్ కోసం ప్రత్యేకమైన కస్టమైజేషన్ ఆప్షన్లను అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇది భారత మార్కెట్లో త్రీ-రో సీటింగ్ కలిగిన ఫుల్-సైజ్ ఎస్‌యూవీ కస్టమర్ల అవసరాలను తీర్చనుంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

Most Read Articles

English summary
The Tata Gravitas has been spotted yet again testing ahead of its launch in the Indian market. The company is expected to launch the Gravitas extended SUV during the festive season this year in the country. Read in Telugu.
Story first published: Sunday, October 18, 2020, 5:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X