టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో టాటా గ్రావిటాస్ కూడా ఒకటి. ఈ బ్రాండ్ తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని తొలిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శినకు ఉంచింది. ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానున్న ఈ మోడల్ ప్రస్తుత పండుగ సీజన్‌లో ఎప్పుడైనా విడుదల కావచ్చని తెలుస్తోంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా గ్రావిటాస్‌ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా తమిళనాడులో టెస్టింగ్ చేస్తున్న టాటా గ్రావిటాస్ మోడల్‌ను ఆటోట్రెండ్ అనే యూట్యూబ్ ఛానెల్ తమ కెమెరాలో బంధించింది. ఓ పెట్రోల్ బంగులో నిలిపి ఉన్న గ్రావిటాస్ ఇంటీరియర్ ఫొటోలను కూడా ఇందులో క్యాప్చూర్ చేశారు.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలు పూర్తిగా వెల్లడికాకుండా ఉంచేందుకు ఈ టెస్టింగ్ వాహనాన్ని భారీగా క్యామోఫ్లేజ్ చేశారు. అయినప్పటికీ, ఇందులోని కొన్ని డిజైన్ ఫీచర్లు వెల్లడయ్యాయి.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా గ్రావిటాస్ డాష్‌బోర్డ్‌పై ఉడ్ ట్రిమ్‌తో ప్రీమియం ఓక్ బ్రౌన్ ఇంటీరియర్‌ థీమ్‌తో దీనిని డిజైన్ చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేసే 8.8 ఇంచ్ సెంట్రల్ మౌంటెడ్ టచ్‌స్క్రీన్ యూనిట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా హారియర్ ప్లాట్‌ఫామ్‌పై టాటా గ్రావిటాస్‌ను తయారు చేశారు, కాబట్టి ఇది చూడటానితి హారియర్ ఎస్‌యూవీకి పొడగించిన వెర్షన్‌గా అనిపిస్తుంది. అయితే, రెండు మోడళ్ల మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి. ప్రధానంగా, గ్రావిటాస్ వెలుపల, స్టాండర్డ్ ఎస్‌యూవీ (హారియర్)లో కనిపించే విధంగా స్వూపింగ్ రూఫ్‌లైన్ ఉండదు.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

అలాగే, ఇందులో మూడవ వరుస ప్రయాణీకులకు ఎక్కువ హెడ్‌రూమ్ ఉండేలా వెనుక డిజైన్‌లో మార్పు చేశారు. గ్రావిటాస్ ఎస్‌యూవీ స్టాండర్డ్ హారియర్ కంటే 62 మి.మీ ఎక్కువ పొడవు ఉంటుంది. ఫలితంగా, లోపలి భాగంలో ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్‌లో మార్పులు మాత్రం చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా పలు ఇతర ఫీచర్లను హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించనున్నారు. అయితే, దీని టెయిల్-ల్యాంప్స్ డిజైన్ మాత్రం రివైజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ స్టాపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు కంపెనీ దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయనుంది. అంతే కాకుండా, ఈ టెస్టింగ్ వాహనంపై కొత్తగా డిజైన్ చేసిన ఫైవ్-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కూడా మనం గమనించవచ్చు.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

ఇకపోతే గ్రావిటాస్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా హారియర్ ఎస్‌యూవీ నుండి తీసుకోబడతాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎస్‌యూవీని పొడగించిన కారణంగా పెరిగిన అదనపు బరువుకు తోడ్పడేందుకు వీలుగా గ్రావిటాస్‌లోని ఇంజన్‌ను కొంచెం ఎక్కువ స్టేట్ ట్యూన్‌తో ఆఫర్ చేయవచ్చని అంచనా.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యువి500 మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ విభాగంలో హ్యుందాయ్, కియా మరియు జీప్ బ్రాండ్‌లు కూడా మరికొన్ని త్రీ-రో సీటింగ్ ఎస్‌యూవీలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్; కొత్త వివరాలు వెల్లడి; లాంచ్ ఎప్పుడంటే?

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా గ్రావిటాస్ భారత మార్కెట్లో త్రీ-రో సీటింగ్ కలిగిన ఫుల్-సైజ్ ఎస్‌యూవీ అవసరాలను తీర్చనుంది. గ్రావిటాస్ ఎస్‌యూవీ ధర హారియర్ కన్నా అధికంగా ఉండనుంది. అయితే, టాటా మోటార్స్ ఈ మోడల్‌ను ఫోర్డ్ ఎండీవర్ మరియు టొయోటా ఫార్చ్యూనర్ మోడళ్ల కన్నా సరసమైన ధరకే ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

Image Courtesy: AutoTrend TV/YouTube

Article Published On: Tuesday, September 8, 2020, 12:11 [IST]
English summary
Tata Motors will be launching a new three-row SUV catering to its growing demand in the Indian market. Called the Gravitas was first showcased at the 2020 Auto Expo and is expected to arrive during the festive season this year in the country. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+