Just In
Don't Miss
- Finance
దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పండుగ సీజన్‌లో టాటా మోటార్స్ సర్‌ప్రైజ్!? - టెస్టింగ్‌లో గ్రావిటాస్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో తమ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్ కోసం ఓ సెవన్ సీటర్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ సిద్ధం చేస్తోంది. టాటా గ్రావిటాస్‌గా పిలువబడే ఈ 7-సీటర్ ఎస్‌యూవీని ఈ సంవత్సరం పండుగ సీజన్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇది ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న టాటా హారియర్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా ఉండనుంది.

టాటా మోటార్స్ తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని తొలిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శినకు ఉంచింది. ఈ మోడల్‌లో ఉత్పత్తికి సిద్ధంగా వెర్షన్‌ను కంపెనీ ఇప్పటికే భారతదేశపు రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా కోయంబత్తూరులో టెస్టింగ్ చేస్తున్న టాటా గ్రావిటాస్ మోడల్‌ను రష్‌లేన్ బృందం తమ కెమెరాలో బంధించింది. డిజైన్ వివరాలు వెల్లడికాకుండా ఉంచేందుకు ఈ టెస్టింగ్ వాహనాన్ని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేశారు.

అయితే, ఈ స్పై చిత్రాలలో టాటా గ్రావిటాస్‌కు సంబంధించిన కొన్ని డిజైన్ ఫీచర్లు మాత్రం వెల్లడవుతున్నాయి. ఇందులో వెనుక టైర్లలో అమర్చిన డిస్క్ బ్రేక్‌లను చూడొచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే, ఈ పెద్ద ఎస్‌యూవీ యొక్క స్టాపింగ్ పనితీరును మెరుగుపరచడానికి కంపెనీ బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు అనిపిస్తోంది. అంతే కాకుండా, ఈ టెస్టింగ్ వాహనంపై కొత్త ఫైవ్-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా చూడొచ్చు.
MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

వాస్తవానికి టాటా మోటార్స్ తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని 2020 ప్రథమార్ధంలో విడుదల చేయాలని భావించారు. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, మార్చ్-మే మధ్య కాలంలో ప్రకటించిన కంప్లీట్ లాక్‌డౌన్ వంటి పరిస్థితుల కారణంగా, ఇతర కంపెనీల మాదిరిగానే టాటా మోటార్స్ ఉత్పత్తి కార్యక్రమాలకు కూడా అంతరాయం ఏర్పడింది.

టాటా గ్రావిటాస్ డిజైన్ విషయానికి వస్తే, కంపెనీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌లోని చాలా వరకూ ఫీచర్లు ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లను టాటా హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించే అవకాశం ఉంది. హారియర్ స్వూపింగ్ డిజైన్‌తో పోల్చితే, గ్రావిటాస్ ఎస్‌యూవీ వెనుక భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది.
MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

మూడవ వరుసలో కూర్చునే ప్రయాణీకులకు ఎక్కువ హెడ్‌రూమ్ ఉండేలా రియర్ డిజైన్‌ను మార్పు చేసి, మొత్తం ఎస్‌యూవీని పొడవను పొడగించారు. టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ పొడవు స్టాండర్డ్ టాటా హారియర్ పొడవు కంటే 62 మి.మీ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉండనుంది.

టాటా గ్రావిటాస్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇవి కూడా హారియర్ ఎస్‌యూవీ నుండే తీసుకోబడతాయి. ఇందులో బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. హారియర్‌లోని ఇంజన్ 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

ఈ ఇంజన్ ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది. గ్రావిటాస్‌లో చేసిన మార్పుల కారణంగా, దీని అదనపు బరువుకు తగినట్లుగా ఇందులోని ఇంజన్ ఆప్షన్లను కొంచెం ఎక్కువ ట్యూన్‌తో అందించవచ్చని తెలుస్తోంది.

టాటా గ్రావిటాస్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లోని మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఇటీవలే మార్కెట్లో విడదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది. అలాగే ఇదే సెగ్మెంట్లో హ్యుందాయ్, కియా మరియు జీప్ నుండి రానున్న సెవన్ సీటర్ మోడళ్లతో ఇది పోటీపడే అవకాశం ఉంది. ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మోడళ్ల ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, టాటా గ్రావిటాస్ ఈ మోడళ్లకు చౌకైన ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది.
MOST READ:మళ్ళీ పడిపోయిన పెట్రోల్ - డీజిల్ అమ్మకాలు ; ఎందుకంటే ?

టాటా గ్రావిటాస్ టెస్టింగ్ ఫేజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ నుంచి రాబోయే ఈ గ్రావిటాస్ ఎస్‌యూవీ స్టన్నింగ్ డిజైన్‌తో పాటుగా అధ్భుతమైన ఫీచర్లతో రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్ మాదిరిగానే గ్రావిటాస్ కూడా సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.