టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

భారతదేశపు అగ్రగామి కార్ తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ దేశీయ విపణిలో కొత్తగా మరో రెండు మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రావిటాస్ అని పిలువబడే సెవన్ సీటర్ ఎస్‌యూవీని మరియు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హారియర్ ఎస్‌యూవీలో ఓ పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఇవి రెండే కాకుండా 'హార్న్‌బిల్' పొడవైన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ మోడల్‌ను దీనిని అంతర్గతంగా 'హెచ్‌బిఎక్స్' అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఈ మోడల్‌ను హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కానీ లేదా దేశంలో అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కానీ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

కాగా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ కొత్త కార్లన్నింటినీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, టాటా గ్రావిటాస్ మరియు టాటా హారియర్ పెట్రోల్ మోడళ్లు టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కాయి. రష్‌లేన్ క్లిక్ చేసిన చిత్రాల ప్రకారం, టాటా గ్రావిటాస్ మరియు టాటా హారియర్ పెట్రోల్ మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించాయి.

MOST READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఈ రెండు ఎస్‌యూవీలు ఇంకా పరీక్ష దశలోనే ఉన్నందున వీటిని కంపెనీ భారీగా క్యామోఫ్లేజ్ చేసి, వివరాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే, టాటా గ్రావిటాస్ మాత్రం తప్పనిసరిగా హారియర్ ఎస్‌యూవీ యొక్క విస్తరించిన మోడల్‌గా అనిపిస్తుంది. హారియర్ 5 సీట్లతో లభిస్తుంటే, గ్రావిటాస్ 7 సీట్లలో లభించే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసం కోసం కంపెనీ వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ముందుగా ఎక్స్‌టీరియర్ మార్పులను గమనిస్తే, స్టాండర్డ్ హారియర్ మోడల్‌లో చూసినట్లుగా విస్తరించిన స్వూపింగ్ రూఫ్‌లైన్ గ్రావిటాస్ ఎస్‌యూవీపై కనిపించదు.

MOST READ:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ - ఆకర్షనీయమైన రేసింగ్ యల్లో కలర్‌లో

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

టాటా గ్రావిటాస్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, నాలుగు సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే ఇంజన్‌ను హారియర్‌లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని, 350 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఇకపోతే, టాటా హారియర్ పెట్రోల్‌ వేరియంట్ విషయానికి వస్తే, డిజైన్ వారీగా కొత్త హారియర్‌కు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బిఎస్6 డీజిల్ మోడల్‌కు ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో కొత్తగా 1.5-లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించున్నట్లు సమాచారం.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఇదొక టర్బోచార్జ్డ్ ఇంజన్, ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని సమాచారం. తరువాతి దశలో టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీలో కూడా ఈ పెట్రోల్ పవర్డ్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఇక టాటా మోటార్స్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన యాజమాన్య ప్రణాళికను ప్రారంభించింది. ఇందు కోసం ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

ఈ భాగస్వామ్యంలో భాగంగా, టాటా నెక్సాన్ ఈ.వి కారును కొనాలనుకునే కస్టమర్లు నెలకు రూ.41,900 నుండి ప్రారంభమయ్యే వివిధ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో కస్టమర్ అవసరాన్ని బట్టి 18 నెలలు, 24 నెలలు మరియు 36 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా మోటార్స్ నుండి మరో రెండు కొత్త కార్లు: స్పై పిక్స్, డిటేల్స్

టాటా గ్రావిటాస్, టాటా హారియర్ పెట్రోల్ మోడళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా, గతంలో తయారీదారులు తమ ఉత్పత్తి కర్మాగారాలను దాదాపు మూడు నెలలు పాటు మూసివేసిన సంగతి మనందరికీ తెలిసినదే. లాక్‌డౌన్ సడలించిన తరువాత, దేశంలో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా తమ కార్యకలాపాలు పునఃప్రారంభించి, త్వరలోనే ఈ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Tata Motors is gearing up to launch a series of new models in the Indian market. The company is expected to launch a seven-seater SUV, called Gravitas and the petrol version on its existing SUV, the Harrier. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X