ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన టాటా గ్రావిటాస్
టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఏడు సీట్ల హారియర్ ఆధారిత ఎస్‌యూవీ ఎట్టకేలకు 2020 ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టాటా గ్రావిటాస్‌ను మొట్టమొదటిసారిగా గత ఏడాది జెనీవా మోటార్ షోలో 'బజార్డ్' నేమ్‌ప్లేట్‌తో ప్రదర్శించడం జరిగింది.

ఇప్పుడు టాటా గ్రావిటాస్ ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది. టాటా హారియర్‌తో పోలిస్తే, గ్రావిటాస్ 62 మి.మీ పొడవును కలిగి ఉంటుంది. ఇది కేవలం ముందు రెండు వరుసలలో ఉండే ప్రయాణికులకు మాత్రమే కాకుండా మూడవ వరుస ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది.

టాటా గ్రావిటాస్ హారియర్ లాగ ఓఎమ్ఇజిఏ ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడింది. ఇది బ్రాండ్ యొక్క సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ తో ముందుకు తీసుకెళ్తుంది.

గ్రావిటాస్ డిజైన్ గమనిస్తే ఇది హారియర్ మాదిరిగానే ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది. ఇందులో డిఆర్ఎల్ లు మరియు హెడ్‌ల్యాంప్ క్లస్టర్ కోసం ముందు భాగంలో ఏర్పాటు చేసిన డ్యూయల్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇందులో రిఫ్రెష్ చేసిన టెయిల్‌ల్యాంప్స్, బూట్ లిడ్ డిజైన్ మరియు రియర్ బంపర్‌లు ఉన్నాయి. ఇతర డిజైన్ మార్పులలో మూడవ-వరుస ప్రయాణీకుల కోసం ఎక్స్టెండెడ్ విండోస్ ని కూడా కలిగి ఉంటుంది.

టాటా గ్రావిటాస్ హారియర్ మాదిరిగానే అదే బిఎస్-6 కంప్లైంట్ 2.0-లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ ద్వారా శక్తినిస్తుంది. ఇంజిన్ గరిష్టంగా 173 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటుంది. టాటా మోటార్స్ గ్రావిటాస్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ కూడా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020 తరువాత టాటా గ్రావిటాస్ ఇండియన్ మార్కెట్లో విక్రయించబడుతుందని కంపెనీ ధ్రువీకరించింది. టాటా గ్రావిటాస్ ఇండియన్ మార్కెట్లో ఒకసారి లాంచ్ అయినా తర్వాత మహీంద్రా అల్టురాస్ జి 4, ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ఇండియన్ మార్కెట్లో చాల మంది వాహనదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్పత్తులలో టాటా గ్రావిటాస్ ఒకటి. దీని చాలా సార్లు రోడ్లపై పరీక్షించడం జరిగింది. ఇప్పుడు ఇది అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ఎక్కువమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








