ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హ్యారియర్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తోంది. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 9 నుండి 19 వరకూ #OneWithMyHarrier అనే క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

మొదటి ఏడాది వార్షికోత్సవ క్యాంపెయిన్‌లో భాగంగా హ్యారియర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్ల కోసం పలు ఆసక్తికరమైన ఆఫర్లను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. పలు అప్‌‌డేట్స్, ప్రత్యేకమైన సర్వీసులు మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా హ్యారియర్ కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న టాటా షోరూముల్లో ఉచితంగా 40-పాయింట్స్ చెక్-అప్స్ ఫ్రీగా నిర్వహిస్తుంది. ఫ్రీ కార్ వాష్ మరియు ఇటీరియర్ కోసం ఫ్రీ వాక్యూమ్ క్లీనింగ్ కూడా అందిస్తోంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

"హ్యారియర్ సర్వీస్ గోల్డ్ క్లబ్"లో రిజిస్టర్ చేసుకునే అకాశాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా రాబోయే రెండేళ్లలో వచ్చే సర్వీసుల్లో సుమారుగా రూ. 8,400 వరకు లాభం పొందవచ్చు. విభిన్నమైన స్కఫ్ ప్లేట్లు మరియు పలు పర్సనలైజ్డ్ బ్యాడ్జీలను కూడా ఆఫర్ చేస్తోంది.

అంతే కాకుండా, టాటా హ్యీరియర్ కొనమని ఇతరులకు రిఫర్ చేసే కస్టమర్లకు 5000 రూపాయల విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్ కూడా అందిస్తోంది. అయితే రిఫరెన్స్ ద్వారా వచ్చే కస్టమర్లు జనవరి 2020 లోపు హ్యారియర్ ఎస్‌యూవీని బుక్ చేసుకుంటే గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా మోటార్స్ హ్యారియర్ ఎస్‌యూవీని తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఆ తర్వాత 2019 జనవరిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. టాటా సొంతం చేసుకున్న జగ్వార్ ల్యాండ్‌రోవర్ (JLR)లోని ల్యాండ్ రోవర్ డి8 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఒమెగా (OMEGA) ఆర్కిటెక్చర్ కింద ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీతో టాటా హ్యారియర్ ఎస్‌యూవీని డిజైన్ చేశారు.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా హ్యీరియర్ విడుదల తర్వాత కొన్నాళ్లకు దీనిని బ్లాక్-ఔట్ వెర్షన్‌లో కూడా లాంచ్ చేశారు. టాటా హ్యారియర్‌లోని రెండు టాప్ ఎండ్ వేరియంట్లను డార్క్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా హ్యారియర్ అన్ని వేరియంట్లలో సాంకేతికంగా 2.0-లీటర్ సామమర్థ్యం కైరోటెక్ డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా మోటార్స్ హ్యారియర్ 5-సీటర్ వెర్షన్‌కు కొనసాగింపుగా గ్రావిటాస్ పేరుతో 7-సీటర్ వెర్షన్‌ కూడా ప్రకటించింది. గత ఏడాది జరిగిన 2019 జెనీవా మోటార్ షోలో టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. మరికొన్ని నెలల్లో టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. టాటా గ్రావిటాస్ కంపెనీ యొక్క హై ఎండ్ మోడల్‌‌గా నిలస్తుంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

టాటా హ్యారియర్‌తో పాటు ఆల్ట్రోజ్, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మీద కూడా టాటా పనిచేస్తోంది. గ్రావిటాస్ మరియు నెక్సాన్ ఇవి కార్లను వచ్చే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది.

ఏడాది పూర్తి చేసుకున్న టాటా హ్యారియర్: మీ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హ్యారియర్ గత ఏడాది మార్కెట్లో తీవ్ర అలజడి సృష్టించింది. రూ. 13 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చి మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తీవ్ర పోటీ సృష్టించింది. విపణిలో ఉన్న కియా సెల్టోస్, ఎంజీ హెక్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ ఎస్‌యూవీలకు టాటా హ్యారియర్ గట్టి పోటీనిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2020, 15:46 [IST]
English summary
Tata Motors Celebrates One-Year Of Harrier SUV: Existing Customers Receive Personalised Benefits. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+