భారత మార్కెట్లో టాటా హారియర్ కొత్త ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా హారియర్ క్యామో ఎడిషన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఆకర్షణీయమైన కలర్స్ లో వచ్చిన స్పెషల్ ఎడిషన్, ఈ రోజు నుండి కంపెనీ డీలర్షిప్ మరియు వెబ్‌సైట్‌లో హారియర్ క్యామో యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

టాటా హారియర్ క్యామో ఎడిషన్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్‌జెఎ మరియు ఎక్స్‌జెఎ ప్లస్ వేరియంట్లు. దీని టాప్ స్పెక్ ధర 20.30 లక్షల రూపాయలు, (ఎక్స్-షోరూమ్).

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
Harrier XT CAMO ₹16,50,000
Harrier XT+ CAMO ₹17,30,000
Harrier XZ CAMO ₹17,85,000
Harrier XZ+ CAMO ₹19,10,000
Harrier XZA CAMO ₹19,15,000
Harrier XZA+ CAMO ₹20,30,000

హారియర్ క్యామో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది మరియు డార్క్ ఎడిషన్‌తో షేర్డ్ టాప్ వేరియంట్‌గా మారింది. ఇది కొత్త క్యామో షేడ్ లో ప్రవేశపెట్టబడింది, ఇది మొదట హెక్సాతో ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడింది, కంపెనీ తన మోడళ్లన్నింటినీ ఈ స్పెషల్ ఎడిషన్‌కు తీసుకువస్తుంది.

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా హారియర్ క్యామో ఎడిషన్ రూపకల్పనలో ఎటువంటి మార్పు జరగలేదు. కానీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రతిబింబించేలా 'క్యామో' గ్రీన్ కలర్ ఇవ్వబడింది. ఈ స్పెషల్ ఎడిషన్ మిలిటరీ వాహనాల వలె కనిపిస్తుంది, దీనికి ఆర్ 17 బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్ కలిగి ఉంది, దీని కారణంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ స్పెషల్ ఎడిషన్‌లో బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్ డాష్‌బోర్డ్, ప్రీమియం బ్లాక్‌స్టోన్ లెదర్ సీట్, కాంట్రాస్ట్ క్యామో గ్రీన్ స్టిచింగ్ మరియు గన్‌మెటల్ గ్రేలో ఇంటీరియర్ ఉన్నాయి. ఇది స్పెషల్ క్యామో గ్రాఫిక్స్, బోనెట్‌లోని హారియర్ మస్కెట్, రూఫ్ రైల్, సైడ్ స్టెప్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌తో సహా అనేక యాక్ససరీస్ పొందుతుంది.

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

దీని క్యాబిన్‌లో బేక్ సీట్ ఆర్గనైజర్, సన్‌షేడ్, 3 డి మోల్డ్ మాట్స్, 3 డి ట్రంక్ మాట్స్ మరియు యాంటీ స్కిడ్ డాష్ మాట్స్ ఉన్నాయి. ఈ యాక్ససరీస్ క్యామో స్టీల్త్ మరియు క్యామో స్టీల్త్ ప్లస్ అనే రెండు ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి, వీటిని రూ. 26,999 అదనపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

దేశ రక్షణకై పాటుపడుతున్న సైనికుల యొక్క గౌరవార్థం టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఏది ఏమైనా ఈ టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉందని టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స అన్నారు.

భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ క్యామో ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, ఈ విధంగా ఉండడం వల్ల పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలను చేపట్టే అవకాశం ఉన్నాడని కమపేని తెలిపింది. హారియర్ కస్టమర్లను మరింత ఆకర్శించడానికి, ఈ స్పెషల్ ఎడిషన్ మార్కెట్లో ప్రారంభించబడింది. దేనికి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి.

MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి

Most Read Articles

English summary
Tata Harrier Camo Launched In India At Rs 16.40 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X