ఇప్పుడు రూ. 16.25 లక్షలకే బిఎస్-6 టాటా హారియర్
టాటా హారియర్ బిఎస్- 6 వెర్షన్ కారుని 2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసింది. ఈ బిఎస్-6 టాటా హారియర్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 16.25 లక్షలతో విడుదల చేసారు.

టాటా హారియర్ బిఎస్ 6 కొత్త నవీనీకరణలతో మరియు అదనపు ఫీచర్స్ తో రానుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కూడా ఉంటుంది. బిఎస్-6 వేరియంట్ ఇప్పుడు 2.0 లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే 30 బిహెచ్‌పి పెరుగుదలను కనపరుస్తుంది.

టాటా హారియర్‌లోని సింగిల్ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు ఆరు-స్పీడ్ మాన్యువల్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో స్టాండర్డ్ లేదా అప్సనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కూడా ఉంటుంది. ఈ కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆరు-స్పీడ్ టార్క్-కన్వర్టర్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇందులో ఎక్స్ఎమ్ఎ, ఎక్స్‌జడ్ఎ మరియు ఎక్స్‌జడ్ఎ ప్లస్ వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

టాటా హారియర్ ధరల విషయానికి వస్తే ఎక్స్‌ఎంఏ వేరియంట్ ప్రారంభ ధర రూ. 16.25 లక్షలతో మొదలవుతుంది. ఎక్స్‌జడ్ఎ ధర రూ. 18.80 లక్షలు మరియు ఎక్స్‌జడ్ఎ ప్లస్ ధర రూ. 19.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది.

ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు హారియర్ బిఎస్-6 డార్క్ ఎడిషన్ ధరలు కూడా పెరిగాయి.వీటి ధరలు రూ. 17.70 లక్షల నుండి రూ. 20.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. ఇదే కాకుండా వేరియంట్ ని బట్టి దాదాపు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

ఎక్స్‌జడ్ఎ ప్లస్ వేరియంట్ ఇప్పుడు కొత్త ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇందులో ఉన్న 6-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు,17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పునఃరూపకల్పన చేసిన ORVM లు, ఆటో-డిమ్మింగ్ IRVM లు చాల వరకు మునుపటి మోడల్ ని పోలి ఉంటాయి.

హారియర్ బిఎస్ 6 టాటా మోటార్స్ కాలిప్సో రెడ్ అనే కొత్త రంగుతో ప్రవేశించింది.ఇప్పుడు బిఎస్ 6 హారియర్ ఎస్‌యూవి 30,000 రూపాయలతో బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
టాటా హారియర్ మునుపటి మోడల్ కంటే మరింత శక్తివంతమైనదిగా ఉటుంది. ఇది ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తన ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఇది ప్రధానంగా 2020 హ్యుందాయ్ క్రెటాకి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








