టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్ కోసం 'హెచ్‌బిఎక్స్' (HBX) అనే కోడ్ నేమ్‌తో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ టాటా హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. దీని ఆధారంగా తయారవుతున్న ఓ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్ 2021లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టడానికి ముందే, టాటా మోటార్స్ తమ హెచ్‌బిఎక్స్ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఇంటీరియర్ ఫొటోలు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి.

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

టీమ్-బిహెచ్‌పి నుండి లీకైన స్పై చిత్రాల ప్రకారం, భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న టాటా హెచ్‌బిఎక్స్ వాహనం కెమెరాకు చిక్కింది. ఇందులోని సెంటర్ కన్సోల్ మరియు డాష్‌బోర్డ్‌ను గమనించినట్లయితే, ఇది కాన్సెప్ట్ వెర్షన్‌లో ప్రదర్శించినట్లుగానే అనిపిస్తుంది.

MOST READ:అప్పుడే హ్యాక్ చేయబడిన HSRP అధికారిక వెబ్‌సైట్ ; తర్వాత ఏం జరిగిందంటే

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

కొత్త టాటా హెచ్‌బిఎక్స్ ఎస్‌యూవీలో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు చుట్టుపక్కల సిల్వర్ యాక్సెంట్స్, బ్లాక్ ఫినిషింగ్‌లో డిజైన్ చేసిన డాష్‌బోర్డ్ మరియు స్కేయర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

టాటా ఆల్ట్రోజ్ కారులో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త టాటా హెచ్‌బిఎక్స్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. ఇలా చేయటం వలన హెచ్‌బిఎక్స్ ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గి, సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సూపర్ ప్లాన్.. అదేంటో తెలుసా ?

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా, టాప్-ఎండ్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభించే అవకాశం ఉంది.

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

దీని ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమసనిస్తే, ఈ టెస్టింగ్ వాహనంలో స్టైలిష్ డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను చూడొచ్చు. ఇందులో వ్రాప్ అరౌండ్ టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి, ఇవి కాన్సెప్ట్ మోడల్‌లో చూసిన వాటికి సమానంగా కనిపిస్తాయి.

MOST READ:కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

టాటా హెచ్‌బిఎక్స్ ఇటీవలే దాని ఫ్రంట్ డిజైన్‌ను వెల్లడించింది, ఇది బ్రాండ్ యొక్క ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన హారియర్‌తో సమానంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు లభిస్తాయి, అవి హెడ్‌లైట్ హౌసింగ్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి. బంపర్ దిగువ భాగంలో ఫాగ్ లైట్స్ కూడా కనిపిస్తాయి.

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

భారత్‌లోని గ్రామీణ పట్టణ రోడ్లకు అనుకూలంగా ఉండేలా రగ్డ్ లుక్‌తో మరియు బంప్‌లను తట్టుకునేందుకు వీలుగా పెద్ద వీల్ ఆర్చెస్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్‌తో ఈ చిన్న కారు మరింత స్టయిలిష్‌గా కనిపించనుంది.

MOST READ:చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; 2021లో విడుదల!

టాటా హెచ్‌బిఎక్స్ కారును టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు దిగువన ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ డాట్సన్ రెడి-గో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని అంచనా.

Source: Team-BHP

Most Read Articles

English summary
Tata HBX Compact SUV Interiors Leaked; Spy Pics And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X