టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గిరాకీ అధికంగా ఉంది. ఈ విభాగంలో ఇప్పటికే దేశంలోని ప్రముఖ తయారీదారులందరూ ఓ కొత్త వాహనాన్ని ఆఫర్ చేస్తున్నారు. తాజాగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంపై కన్నేసింది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఏషియన్ మార్కెట్ల కోసం ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసే పనిలో టాటా మోటార్స్ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు (స్పై పిక్స్) రోసారి లీక్ అయ్యాయి. గడచిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన కాన్సెప్ట్ కార్ ఆధారంగా ఓ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను టాటా టెస్ట్ చేస్తోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

లాక్‌డౌన్ ముగియడంతో టాటా ఈ కారును రోడ్లపై తిరిగి టెస్ట్ చేయటం ప్రారంభించింది. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసిన కాంపాక్ట్ కారును టాటా టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ కారును టాటా హెచ్‌బిఎక్స్ లేదా హార్న్‌బిల్ అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఈ మైక్రో ఎస్‌యూవీ టెస్టింగ్ విజయవంతం అయితే, అతి త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

MOST READ:ఇది చూసారా.. హ్యుందాయ్ షోరూమ్ రిసెప్షనిస్ట్‌గా వీధి కుక్క

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

టాటా నుంచి విడుదలైన పాపులర్ కార్ టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసినట్లుగానే ఆల్ఫా ఆర్కిటెక్చర్ మరియు ఇంపాక్ట్ 2.0 డిజైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఈ మైక్రో ఎస్‌యూవీని అభివృద్ది చేయనున్నట్లు సమాచారం. టాటా హ్యారియర్ ఎస్‌యూవీ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఎత్తుగా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

టాటా మోటార్స్ 2018 ఆటో ఎక్స్‌పోలో తమ ఫ్యూచర్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ మరింత అప్‌గ్రేడ్ చేసిన హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. టాటా హెచ్‌బిఎక్స్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కావచ్చని అంచనా.

MOST READ:50 ఏళ్ల ల్యాండ్ రోవర్ నడుపుతున్న టీనేజ్ అమ్మాయి [వీడియో]

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

తాజాగా ఈవోఇండియా లీక్ చేసిన చిత్రాలను చూస్తుంటే, ఈ కారుకు సంబంధించిన కొద్దిపాటి డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. గడచిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్‌కు, ప్రొడక్షన్ వెర్షన్ దాదాపు 90 శాతం సిమిలారిటీస్ ఉండే అవకాశం ఉంది. చిత్రాలలో చూసినట్లుగా, టాటా హెచ్‌బిఎక్స్ భారీ క్యామోఫ్లేజ్‌తో టెస్టింగ్ చేయబడుతోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఈ మైక్రో-ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు లభిస్తాయి, అవి హెడ్‌లైట్ హౌసింగ్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి. బంపర్ దిగువ భాగంలో ఫాగ్ లైట్స్ కూడా కనిపిస్తాయి. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తక్కవ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కారును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

భారత్‌లోని గ్రామీణ పట్టణ రోడ్లకు అనుకూలంగా ఉండేలా రగ్డ్ లుక్‌తో మరియు బంప్‌లను తట్టుకునేందుకు వీలుగా పెద్ద వీల్ ఆర్చెస్‌తో హార్న్‌బిల్ రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్‌తో ఈ చిన్న కారు మరింత స్టయిలిష్‌గా కనిపించనుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న ఇంటీరియర్ తరహాలోనే ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో దాదాపు అవే ఇంటీరియర్స్ కనిపించే అవకాశం ఉంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని రైలు పట్టాలపై నడిచే సైకిల్

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఇందులో ప్రధానంగా, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ మరియు డ్యాష్‌బోర్డ్, ఆంబియెంట్ ఇంటీరియర్ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఈ కొత్త కారులో కూడా ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఇంజన్ విషయానికి వస్తే.. టాటా ఆల్ట్రోజ్ కారులో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త టాటా హెచ్‌బిఎక్స్‌లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇలా చేయటం వలన హెచ్‌బిఎక్స్ ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గి, సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావచ్చు.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వచ్చే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ - డిటేల్స్

టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా హెచ్‌బిఎక్స్ కారును టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు దిగువన ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. ఇది టాటా మోటార్స్‌కు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా మారే అవకాశం ఉంది. టాటా హెచ్‌బిఎక్స్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ డాట్సన్ రెడి-గో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tata Motors has a couple of new models in its pipeline that it will launch in the Indian market soon. One of them is a tall-riding hatchback, which is called the 'Hornbill' and was internally referred to as 'HBX'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X