టాటా హెక్సా ఉత్పత్తిని నిలిపివేసిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా.. !
టాటా మోటార్స్ తన బ్రాండ్ అయిన హెక్సా కారును భారత మార్కెట్లో నిలిపివేసింది. టాటా హెక్సా మార్చి నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడు కాలేదు. టాటా హెక్సా కారు ఇండియన్ మార్కెట్లో ఎందుకు నిలిపివేయబడింది అనే విషయాన్నీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

టాటా మోటార్స్ గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడు కానందున ఈ కార్ల యొక్క ఉత్పత్తిని టాటా మోటార్స్ నిలిపివేసింది. టాటా మోటార్స్ యొక్క టాటా హెక్సా మోడల్ కారులో 2.2 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఎంట్రీ లెవల్ హెక్సా 148 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఎంట్రీ లెవల్ హెక్సా కారులో వెరికార్ 320 ఇంజన్ ఉండగా, మిగిలిన మోడల్స్ లో వెరికార్ 400 ఇంజన్ ఉంటుంది. హై-స్పెక్ 2.2 లీటర్ ఇంజన్ 154 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ఎంపికలతో అందించబడుతుంది. టాప్-స్పెక్‌లో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

టాటా మోటార్స్ యొక్క టాటా హెక్సాన్ ఒక్క యూనిట్ కూడా అమ్మకపోవడంతో కారు నిలిపివేయబడింది. దీనికి బదులుగా భారత మార్కెట్లో హెక్సా సఫారి ఎడిషన్‌ను విడుదల చేయడానికి టాటా సన్నద్ధమవుతోంది.

టాటా మోటార్స్ ఇటీవల 2020 ఆటో ఎక్స్‌పోలో హెక్సా సఫారి ఎడిషన్ కారును ఆవిష్కరించింది. ఈ కారులో బిఎస్ 6 ఇంజన్ అమర్చారు. ఇది బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

హెక్సా సఫారి ఎడిషన్ కారులో 2.2 లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 153 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బిఎస్ 4 ఇంజన్ 151 బిహెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ మూడు ట్రాన్స్-మిషన్ ఎంపికలతో అందించబడుతుంది. అవి వరుసగా 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్-మిషన్ ఎంపికలు.

ప్రామాణిక మోడల్‌తో పోలిస్తే హెక్సా సఫారి ఎడిషన్ మరింత బోల్డ్ లుక్‌ని కలిగి ఉంది. ఈ కారు ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో లోపలి మరింత అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది. ఇది 4x4 డ్రైవ్‌ట్రెయిన్‌తో నవీకరించబడి ఉంటుంది. టాటా హెక్సా ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 13.7 లక్షల నుంచి రూ. 19.27 లక్షలకు అమ్ముడవుతున్నట్లు (ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) తెలిపింది.


Click it and Unblock the Notifications








