టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జులై నెల ఆఫర్లలో భాగంగా తమ బ్రాండ్ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా, క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది.

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

జూలైలో మొత్తం రూ.80,000 వరకు ప్రయోజనాలు టాటా మోటార్స్ అందిస్తోంది, కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి ఇవి మారుతు ఉంటాయి. టాటా మోటార్స్ డిజిటల్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ‘క్లిక్ టు డ్రైవ్' ద్వారా కూడా కస్టమర్లు ఈ డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆఫర్లు జూలై 31, 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా కంపెనీ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

టాటా టియాగో

కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోపై మొత్తం రూ.35,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో మీ పాత కారును డీలర్‌కు విక్రయించేటప్పుడు రూ.15,000 నగదు తగ్గింపు మరియు రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు, అర్హతను బట్టి రూ.10,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

టాటా టిగోర్

టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్-సెడాన్ టాటా టిగోర్‌పై కంపెనీ రూ.50,000 వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. కస్టమర్ అర్హతను బట్టి రూ.10,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీ మోడళ్లలో టాటా నెక్సాన్ ఒకటి. టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో నెక్సాన్ ముందంజలో ఉంది. ఈ పాపులర్ ఎస్‌యూవీపై ఎలాంటి నగదు తగ్గింపు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేవు. అయితే, కస్టమర్ అర్హతను బట్టి కంపెనీ రూ.10,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది.

MOST READ:చివరి కోరిక: నచ్చిన కారుతో సహా రాజకీయనాయకుని అంత్యక్రియలు

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

టాటా హారియర్

టాటా మోటార్స్ ప్రీమియం ఎస్‌యూవీ టాటా హారియర్‌పై కంపెనీ జులై నెల ఆఫర్లలో భాగంగా గరిష్టంగా రూ.80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంజనీర్లతో కలిసి రూపొందించిన ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.25,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు అర్హతను బట్టి రూ.15,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

పైన పేర్కొన్న ఆఫర్ స్పెషల్ డార్క్ ఎడిషన్ మోడళ్లతో పాటు ఎక్స్‌జెడ్+ మరియు ఎక్స్‌జెడ్ఏ+ వేరియంట్లకు వర్తించదు. అయితే, డార్క్ ఎడిషన్ మోడల్స్‌పై రూ.55,000 వరకూ కంపెనీ ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో అదే ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర వేరియంట్లతో అందించే కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

MOST READ:హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‍‌పై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు. అయితే, కస్టమర్లకు ఆల్ట్రోజ్ కారు యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ వీటిపై కొత్త ఫైనాన్స్ పథకాలను ప్రకటించింది. కొత్త ఫైనాన్స్ పథకం వినియోగదారులకు నెలవారీ వాయిదాలలో ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని అందిస్తుంది.

టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

టాటా మోటార్స్ జులై నెల ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. జూలైలో కొత్త టాటా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు మరియు సులభమైన ఫైనాన్స్ ఆప్షన్స్ లభిస్తాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు కోసం కస్టమర్లు తమకు సమీపం డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా తమకు కావలసిన వాహనాన్ని పరిశోధించడానికి మరియు కొనుగోలు చేయడానికి బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌కు లాగిన్ కావచ్చు.

MOST READ:దొంగలించిన వాహనాలను గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్

Most Read Articles

English summary
Tata Motors announced attractive discounts and special offers on select models in the brand lineup during this month. The company is offering cash discounts, exchange bonuses, and corporate discounts. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X