టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' అందిస్తున్న "హారియర్ డార్క్ ఎడిషన్" లో కంపెనీ కొత్త వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు 'ఎక్స్‌టి' మరియు 'ఎక్స్‌టి +' వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.16.50 లక్షలు మరియు రూ.17.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

టాటా హారియర్ ఎస్‌యూవీలో కొత్తగా విడుదల చేసిన డార్క్ ఎడిషన్ వేరియంట్లు ఇప్పుడు ఆయా స్టాండర్డ్ మోడళ్ల కంటే రూ.10,000 మాత్రమే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అలాగే, కొత్తగా ప్రారంభించిన వేరియంట్లు ఇప్పుడు హారియర్ డార్క్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ యొక్క బేస్ వేరియంట్‌లుగా ఉంటాయి.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

తాజా అప్‌డేట్ తర్వాత టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు రెండు ఆటోమేటిక్ వేరియంట్‌లతో పాటుగా మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ఏ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ధరలు రూ.16.50 లక్షల నుంచి రూ.20.30 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

స్టాండర్డ్ హారియర్ మోడల్‌తో పోలిస్తే టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో అనేక మార్పులు ఉంటాయి. ఇందులో ‘అట్లాస్ బ్లాక్' అని పిలువబడే ఆల్-బ్లాక్ పెయింట్ స్కీమ్, 17 ఇంచ్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో బ్లాక్-అవుట్ స్కఫ్ ప్లేట్లు, డార్క్-టోన్డ్ టెయిల్ లాంప్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా మొదలైనవి ఉంటాయి.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌లో బ్లాక్-అవుట్ క్యాబిన్, కాంట్రాస్ట్ గ్రే స్టిచింగ్‌తో బెనెక్ కాలికో లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ మరియు బ్లాక్‌స్టోన్ గ్రే డాష్‌బోర్డ్ ఉంటాయి. స్టాండర్డ్ హారియర్ వేరియంట్లలో కనిపించే అన్ని క్రోమ్ ట్రిమ్‌లు ఇందులో కొత్త గన్‌మెటల్ గ్రే క్రోమ్ ప్యాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇది ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌లకు మరింత కాంట్రాస్టింగ్ లుక్‌ని ఇస్తుంది.

MOST READ: మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

ఈ మార్పులే కాకుండా, టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో స్టాండర్డ్ మోడల్‌లో లభించే అన్ని ఇతర ఫీచర్లు యధావిధిగా కొనసాగుతాయి. ఇందులో 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 7-ఇంచ్ కలర్ ఎమ్ఐడి, క్లైమేట్ కంట్రోల్ మరియు 9-స్పీకర్ జెబిఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

ఈ ఎస్‌యూవీలోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు-ఎయిర్‌బ్యాగ్‌లు. ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, సీట్-బెల్ట్ రిమైండర్‌, హై-స్పీడ్ అలెర్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ: రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

యాంత్రికంగా డార్క్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పు లేదు. స్టాండర్డ్ మోడళ్లలో కనిపించే బిఎస్-6 2.0-లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో తాజా అప్‌డేట్‌తో పాటుగా కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఎక్స్‌టి + వేరియంట్ ధరలను కూడా పెంచింది. ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ.17.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. దాని ప్రారంభ రిటైల్ ధరతో పోల్చుకుంటే ఇది రూ.21,000 అధికంగా ఉంది.

MOST READ: ఇది చూసారా.. బామ్మకోసం 4 దేశాలు కాలినడకతో ప్రయాణించిన 10 ఏళ్ల బాలుడు

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దీపావళి, దసరా వంటి ప్రస్తుత పండుగ సీజన్‌లో, కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ కొత్త మరియు సరసమైన స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీ ఇప్పుడు మునుపటి కన్నా తక్కువ ధరకే లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Tata Motors has launched new variants of the Harrier Dark edition in the India market. The Harrier Dark edition is now available in 'XT' and 'XT+' and are priced at Rs 16.50 lakh and Rs 17.30 lakh (ex-showroom, India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X