లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

భారతదేశంలో కరోనా వ్యాపించడం వల్ల 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ప్రభావం వల్ల వాహన రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో నిత్యావసరాలకు కూడా కొరత ఏర్పడింది. ఈ కారణంగా చాలామంది కరోనా లాక్ డౌన్ లో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా సహాయపడటానికి ముందుకు వచ్చింది.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

లాక్ డౌన్ సమయంలో టాటా మోటార్స్ మరియు టాటా గ్రూప్ అవసరమైన వారికి సహాయపడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

ఈ క్లిష్ట సమయంలో అవసరమైన వారికి సహాయం చేయడానికి టాటా మోటార్స్ ముందడుగు వేసింది. ఆహారం, నీరు మరియు అవసరమైన వస్తువులను సరఫరా చేయనుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి ఆహార ప్యాకెట్లు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేసింది.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

టాటా మోటార్స్ చేస్తున్న సేవలో తమ వంతు సహాయంగా స్వచ్చందంగా సేవ చేయడానికి ట్రక్ డ్రైవర్లు, సైనిక సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది కూడా ముందుకు వచ్చారు. సంస్థ ఇప్పటి వరకు 25 వేల ఫుడ్ ప్యాకెట్లు, 5,000 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసింది. పోలీసులు చెక్‌పోస్టుల వద్ద నీటి బాటిళ్లను కూడా పంపిణీ చేస్తున్నారు.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

కరోనా వైరస్ నివారణకు టాటా కంపెనీ మూడు అంశాలపై పనిచేస్తోంది. ఈ మూడు అంశాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. నిత్యావసరాల పంపిణీ :

టాటా మోటార్స్ తన సిబ్బంది సహాయంతో కార్మికులకు మరియు నిరుపేదలకు అవసరమైన వస్తువులను వ్యవస్థీకృత పద్ధతిలో పంపిణీ చేస్తోంది. వీరిలో గ్రామస్తులు, వలస కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, వాహనదారులు ఉన్నారు. టాటా మోటార్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అవసరమైన పదార్థాలను సరఫరా చేసింది.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

2. వైద్య పరికరాల పంపిణీ :

టాటా మోటార్స్ మాస్కులు మరియు శానిటైజర్లను తయారు చేయడానికి స్వయం సహాయక బృందాలకు సహాయం చేస్తోంది. ఈ మాస్కులు మరియు శానిటైజర్లను కంపెనీ తయారీ కర్మాగారం సమీపంలో ఉన్న ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ మరియు సైనిక సిబ్బందికి పంపిణీ చేస్తారు.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

ఈ రోజు వరకు సంస్థ దాదాపు 17,000 చేతితో తయారు చేసిన మాస్కులు పంపిణీ చేసింది. మునిసిపల్ ఆస్పత్రులు ఎన్ 95 మాస్క్, శానిటైజర్ మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లను అందించాయి.

లాక్‌డౌన్ లో ప్రజలకు 3 రకాల సహాయక చర్యలు చేస్తున్న టాటా మోటార్స్, అవి ఏమో తెలుసా.. !

3. కరోనాపై అవగాహన కల్పించడం :

మురికివాడలు మరియు వెనుకబడిన ప్రాంతాల్లో టాటా మోటార్స్ కరోనాపై అవగాహన కల్పిచడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతే కాకుండా సంస్థ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా సరళమైన మరియు సులభమైన జాగ్రత్తల గురించి మరింత అవగాహన పెంచుతోంది.

కరోనా వైరస్ ప్రభావం వల్ల బాధపడుతున్న వారికి సహాయం చేస్తున్న టాటా మోటార్స్ కంపెనీ చాలా అభినందనీయం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కష్టపడుతున్న ప్రజలకు తమవంతు సహాయం చేయాడానికి మరింత మంది ముందుకు రావాలి.

Most Read Articles

English summary
Tata Motors adopts 3 pronged CSR approach to combat Covid 19. Read in Telugu.
Story first published: Thursday, April 9, 2020, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X