టాటా మోటార్స్ వారి మొదటి ఎల్‌ఎన్‌జి బస్ చూసారా.. !
సాధారణంగా డీజిల్ మరియు పెట్రోల్ తో నడిచే వాహనాలవల్ల పర్యావరణంలో కాలుష్యం పెరుగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న వాహనాలవల్ల వాతావరణంలో కలుషిత వాయువులు అధికమవుతున్నాయి.

వాతావరణానానికి హానికారకాలయిన డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ వాహనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ మరొక్క అడుగు ముందుకు వేసింది.
టాటా మోటార్స్ లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) ఇంజిన్ తో నడిచే కొత్త బస్సులను అభివృద్ధి చేసింది. అంతే కాకుండా టాటా మోటార్స్ ఇటీవల ముగిసిన 2020 ఆటో ఎక్స్‌పోలో తన బ్రాండ్ యొక్క కొత్త బస్సులను ప్రదర్శించింది.
టాటా మోటార్స్ తయారు చేసిన ఈ కొత్త బస్సులలో 36 సీట్ల ఎల్‌ఎన్‌జి ఎసి-టైప్ టూ-స్టార్ బస్సులను తయారు చేసి మార్కెట్లో పంపిణీ చేస్తుంది. ఈ బస్సులు గుజరాత్‌లోని దహేజ్ మరియు కేరళలోని కొచ్చిలోని ఎల్‌ఎన్‌జి పెట్రోనెట్ లిమిటెడ్ వారిచే పంపిణీ చేయబడుతోంది.
ఎల్‌ఎన్‌జి ఇంజిన్లను కలిగిన టాటా మోటార్స్ యొక్క బస్సులు నిర్ణీత కాల పరిమితితో తయారు చేయడమే కాకూండా, నిర్ణీత సమయంలో కూడా పంపిణీ చేస్తోంది. ఈ కొత్త బస్సులు చాలా సౌకర్యవంతగా ఉండటంతో పాటు పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయవు. టాటా మోటార్స్ ఇప్పుడు వీటిని 40 సీట్లు మరియు 56 సీట్లలో కూడా అభివృద్ధి చేస్తోంది.
టాటా మోటార్స్ యొక్క ఎల్‌ఎన్‌జి బస్సులు సిఎన్‌జి బస్సుల కంటే 2.5 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎల్‌ఎన్‌జిలు నిండి ఉంటే ఈ బస్సులు 600 - 700 కిలోమీటర్లు నడుస్తాయి. ఎల్‌ఎన్‌జి బస్సులు పర్యావరణ చాలా అనుకూలంగా ఉంటాయి.
ఈ కొత్త ఎల్‌ఎన్‌జి బస్సులు తక్కువ బరువుతో ఉన్నప్పటికీ ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్త్యాన్ని కలిగి ఉంటాయి. టాటా మోటార్స్ వారు ఈ కొత్త ఎల్‌ఎన్‌జి బస్సులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచడమే కాకుండా ప్రయాణికులకు మరింత భద్రతను కూడా చేకూర్చుతాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సాధారణంగా డీజిల్ మరియు పోపేట్రోల్ వాహనాలవల్ల కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలాగె జరిగితే భూమిపై ఉండే అన్ని జీవరాసుల మనుగడ చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి నేచురల్ గ్యాస్ తో నడిచే వాహనాల తయారీ అనేది నేటి సమాజానికి ఎంతైనా అవసరం. ఈ విధానంగా నేచురల్ గ్యాస్ తో నడిచే వాహనాల వల్ల పర్యావరణం ఎటువంటి హానికి గురికాకుండా ఉంటుంది.


Click it and Unblock the Notifications