Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Movies
Vakeelsaab 9 days collections: టార్గెట్‌కు ఇంకా కొద్దీ దూరంలోనే.. కోవిడ్ కష్టకాలంలో సాధ్యమేనా?
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Sports
MI vs SRH: ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు: వార్నర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా గ్రావిటాస్‌లో 6-సీటర్, 7-సీటర్ వెర్షన్లు: హెక్టర్ ప్లస్‌కి గట్టి పోటీ!
టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం 'గ్రావిటాస్' అనే కొత్త ఎస్‍యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న హారియర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని, దానికి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా మరింత ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో గ్రావిటాస్‌ను తయారు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ టాటా గ్రావిటాస్ 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో వస్తుందని భావించారు. అయితే, తాజాగా గాడివాడి నుండి వచ్చిన సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రావిటాస్ ఎస్‌యూవీ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కావచ్చని తెలుస్తోంది.

ఇందుకు ప్రధాన కారణంగా, ఈ విభాగంలో టాటా గ్రావిటాస్‌కు ప్రధాన పోటీదారు అయిన ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో 6-సీటర్ వెర్షన్ అందుబాటులో ఉండటం మరియు ఇందులో కొత్తగా 7-సీటర్ వెర్షన్ విడుదల కాబోతుండటమే. ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు టాటా మోటార్స్ కూడా తమ గ్రావిటాస్‌ను 6, 7 సీట్లతో విడుదల చేయనుంది.
MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

టాటా గ్రావిటాస్ 6-సీటర్ వెర్షన్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండి 2+2+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉండనుంది. అలాగే, టాటా గ్రావిటాస్ 7-సీటర్ వెర్షన్‌లో మధ్య వరుసలో బెంచ్ సీటు ఉండి 2+3+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. హెక్టర్ ప్లస్‌లో కూడా ఎమ్‌జి మోటార్స్ ఇదే తరహా సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను ఫాలో కానుంది.

గతంలో టాటా మోటార్స్ అందించిన హెక్సా ఎమ్‌పివిలో కూడా 6-సీటర్ మరియు 7-సీటర్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. కాబట్టి, గ్రావిటాస్‌లో ఈ రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లను ఆఫర్ చేయటం కంపెనీకి పెద్ద పనేమీ కాదు. పైగా, భారత్‌లో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన కార్లకు గిరాకీ కూడా అధికంగానే ఉంటుంది.
MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

కాగా, భారత్‌లో టాటా గ్రావిటాస్ టెస్టింగ్ దశ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ క్యామోఫ్లేజ్‌తో టెస్టింగ్ చేసిన గ్రావిటాస్ తొలిసారిగా ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఇటీవలే కెమెరాకు చిక్కింది. దీన్ని బట్టి చూస్తుంటే, అతి త్వరలోనే (బహుశా జనవరి 2021లోనే) ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాటా గ్రావిటాస్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ ఈ కారుని హారియర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. టాటా హారియర్‌లో కనిపించే అనేక పరికరాలు, విడిభాగాలు గ్రావిటాస్‌లో కూడా కనిపించనున్నాయి. వీటిలో ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా ఉంటాయి.
MOST READ:అక్కడ వాహనాలపై ఆ పేర్లు ఉన్నాయంటే.. ఇక అంతే..!

టాటా హారియర్ ఎస్‌యూవీలో బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 పిఎస్ పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టాటా గ్రావిటాస్ కూడా ఇదే డీజిల్ ఇంజన్‌తో రానుంది. అయితే, గ్రావిటాస్ ఎస్‌యూవీని పొడగించిన కారణంగా పెరిగిన అదనపు బరువుకు తోడ్పడేందుకు వీలుగా ఇందులోని పవర్, టార్క్ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ గురించి ఎలాంటి సమాచారం లేదు.
MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

టాటా గ్రావిటాస్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఈ విభాగంలో ఇది ప్రధానంగా ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మోడల్‌కి పోటీగా ఉంటుంది. అలాగే, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.