కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ "టాటా నెక్సాన్" కోసం కంపెనీ అతి తక్కువ ఈఎమ్ఐ ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లకు నెక్సాన్ కారు కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కంపెనీ ఈ మోడల్‌పై కేవలం రూ.5,999 నెలసరి వాయిదా (ఈఎమ్ఐ)కే ఫైనాన్స్ అందిస్తోంది.

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

వాయిదాలు ప్రారంభించిన తేదీ నుండి మొదటి ఆరు నెలలకు తక్కువ ధర ఈఎమ్ఐ వర్తిస్తుంది. రుణ పదవీకాలం ఐదేళ్ళకు నిర్ణయించబడుతుంది మరియు రుణాన్ని తిరిగి చెల్లించే వ్యవధిలో ఈ మొత్తం పెరుగుతూనే ఉంటుంది.

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

రుణ పదవీకాలం ముగిసే సమయానికి, టాటా మోటార్స్ తమ వినియోగదారులకు వాహన యాజమాన్య సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు మిగిలిన మొత్తాన్ని తిరిగి ఫైనాన్స్ (రీ-ఫైనాన్స్) చేయడానికి కూడా అవకాశం కల్పిస్తోంది. కొత్త ఈఎమ్ఈ పథకం మాత్రమే కాకుండా, జీరో-డౌన్ చెల్లింపుతో వినియోగదారులకు 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

అంతేకాకుండా, టాటా మోటార్స్ తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ఆరు నెలల పాటు ఈఎమ్ఐ మినహాయింపును కూడా అందిస్తోంది. ఈ పథకాన్ని ఎంచుకునే కస్టమర్‌లు అసలు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు, కాకపోతే ఆ సయమానికి వారు నామమాత్రపు వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.12.70 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, టాటా మోటార్స్ కొనుగోలుదారులకు యాజమాన్యాన్ని సులభంగా అందించాలని మరియు వివిధ రకాల ఫైనాన్స్ పథకాలతో కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:పోలీసులతో గొడవపడిన జొమాటో డెలివరీ గర్ల్, తర్వాత ఏం జరిగిందంటే ?

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ (డిఆర్‌ఎల్‌లు), కొత్త ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ గ్రిల్ మరియు సిల్వర్ ఇన్సర్ట్‌లు మరియు ఫాగ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ వాహనానికి మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

ఇంటీరియర్స్‌లో, కొత్త ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:స్కోడా సూపర్బ్ స్పోర్ట్ లైన్ సెడాన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ‘ఎకో', ‘సిటీ' మరియు ‘స్పోర్ట్' అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

కేవలం రూ.5,999 ఈఎమ్ఐకే టాటా నెక్సాన్ - వివరాలు

టాటా నెక్సాన్ తక్కువ ఈఎమ్ఐ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో పండుగ సీజన్ సెంటిమెంట్‌ను బలపరచేందుకు టాటా మోటార్స్ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కస్టమర్ల కొనుగోలు ప్రక్రియను సులభంగా పూర్తి చేయడంలో సహాయపడేందుకు తక్కువ ఈఎమ్ఐ, ఈఎమ్ఐ మినహాయింపు వంటి పథకాలను అందిస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors has introduced a new Low EMI scheme with the Nexon compact-SUV in the Indian market. Monthly instalments will start from as low as Rs 5,999 per month, making it extremely easy to purchase the compact-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X