భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశీయ మార్కెట్లో తమ కొత్త అల్ట్రా టి.7 ట్రక్కును ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి పట్టణ రవాణాను లక్ష్యంగా చేసుకొని కంపనీ ఈ ట్రక్కును ప్రత్యేకంగా రూపొందించింది.

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

ఇది దేశంలోని అత్యంత అధునాతనమైన లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి)గా ఉంటుందని, ఇది పరిశ్రమలో కెల్లా అత్యుత్తమమైన ఆపరేటింగ్ ఎకనామిక్స్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ తమ అల్ట్రా టి.7 ట్రక్కును అత్యుత్తమ-తరగతి సౌకర్యాన్ని (బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్) అందించేలా మరియు టర్నరౌండ్ సమయాన్ని తగ్గించేలా సరికొత్త సొగసైన క్యాబిన్ (1900 మిమీ వెడల్పు)తో రూపొందించింది.

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

ఇది యజమానులకు ఆదాయాలకు అధిక సామర్థ్యాన్ని జోడించడమే కాకుండా లాజిస్టిక్స్ రంగం సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. టాటా అల్ట్రా టి.7 కొత్త మాడ్యులర్ ఛాస్సిస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది మంచి మన్నికను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

ఇందులోని కొత్త అండర్‌పిన్నింగ్‌ల కారణంగా టాటా మోటార్స్‌ ఇందులో వేర్వేరు డెక్ పొడవులతో ట్రక్కును అందించగలదు. టాటా అల్ట్రా టి.7 ను 4-టైర్లు లేదా 6-టైర్ల కలయికలో అందిస్తారు. ఇది వివిధ రకాల వస్తువుల రవాణాకు అనువుగా ఉంటుంది.

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త టాటా అల్ట్రా టి.7 సాంకేతికంగా అభివృద్ధి చెందిన 4 ఎస్‌పిసిఆర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ కేవలం 1200 నుండి 2200 ఆర్‌పిఎమ్ మధ్యలోనే గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని కొత్త ఇంజన్ మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

టాటా అల్ట్రా టి.7 అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో క్రాష్-టెస్టెడ్ క్యాబిన్, సర్దుబాటు చేయగల సీటింగ్ స్థానాలు, ఎయిర్ బ్రేక్‌లు, తక్కువ ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలు, మ్యూజిక్ సిస్టమ్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, మెరుగైన రవాణా నిర్వహణ కోసం అనుసంధానించబడిన వాహన పరిష్కారాలు మొదలైనవి మరెన్నో ఉన్నాయి.

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

టాటా అల్ట్రా టి.7 ట్రక్కును మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా, టాటా మోటార్స్ ఐఎల్‌సివి ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ సీతాపతి మాట్లాడుతూ, టాటా అల్ట్రా టి.7 దాని అవార్డ్ విన్నింగ్ డిజైన్‌తో యజమానులకు అత్యధిక లాభదాయకతను అందించగలదని, దీనిని కంఫర్ట్ మరియు పెర్ఫామెన్స్ కలయికతో రూపొందించామని తెలిపారు.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

భారత్‌లో టాటా అల్ట్రా టి7 ట్రక్ విడుదల; పట్టణ రవాణానే టార్గెట్!

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1, 2021 నుండి పెంచుతామని ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు పెరగడం ఫలితంగా, ఇన్‌పుట్ ఖర్చులు అధికం కావటం అలాగే, ఫోరెక్స్ ప్రభావం మరియు వాహనాలను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం వంటి పలు కారణాల వలన ధరలను పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ తెలిపింది.

Most Read Articles

English summary
Tata Motors Launched Ultra T.7 Truck In India For Urban Transportation, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X