భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

కరోనా మహమ్మారి రోజు రోజుకి అత్యథికంగా వ్యాపిస్తున్న కారణంగా కరోనా నివారణలో భాగంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించబడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి చాలా మంది సినీనటులు మరియు చాలా ఆటో పరిశ్రమలు తమ వంతు మద్దతుని ప్రకటిస్తున్నాయి.

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

భారతదేశం కోవిడ్-19 సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో చాలా మంది ఆటోమొబైల్ తయారీదారులు ఆర్ధిక సహాయమా చేయడానికి ముందుకు వచ్చారు. ఇందులో టాటా మోటార్స్ ఒకటి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్థ కూడా తన మద్దతు ఇస్తోంది.

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

టాటా మోటార్స్ కరోనావైరస్ సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడటానికి E3 వ్యూహాన్ని అవలంబించింది. ఇందులో అవసరమైన సామాగ్రి సదుపాయం, కరోనా నియంత్రణ మరియు నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ వ్యూహ సహాయంతో, కంపెనీ ఇప్పటివరకు 2.7 లక్షల మంది ప్రజలకు సానుకూలంగా సహాయంగా చేసింది.

MOST READ:కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

ఇప్పటివరకు టాటా మోటార్స్ కంపెనీ 1,12,025 కు పైగా భోజనం, 10,350 వాటర్ బాటిల్స్ మరియు 10,153 రేషన్ కిట్లను వలసదారులకు మరియు ఒంటరిగా ఉన్న వర్గాలకు, పట్టణ మురికివాడల వద్ద, రవాణా శిబిరాల వద్ద మరియు దేశవ్యాప్తంగా గ్రామాలకు పంపిణీ చేసింది. లక్నోలో ఆహార సంబంధిత అభ్యర్థనల కోసం తాత్కాలిక మరియు కాంట్రాక్టు పనివారి కోసం వారు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు.

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

భారతదేశంలో టాటా మోటార్స్ 75,568 సర్టిఫైడ్ రెగ్యులర్ మరియు డిస్పోజబుల్ మాస్క్‌లు, 14,545 ఎన్-95 మాస్క్‌లు, రెండు వెంటిలేటర్లు, 14,765 బాటిల్స్ శానిటైజర్లు, 275 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్లు, 5000 లీటర్ల సోడియం హైడ్రోక్లోరైడ్, ఐదు థర్మల్ స్కానర్లు మరియు 3000 విటమిన్ సప్లిమెంట్లను ప్రభుత్వ ఆసుపత్రులలో పంపిణీ చేసింది.

MOST READ:లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

ఇటీవలి కోవిడ్-19 వార్తలకు సంబంధించిన వార్తలలో, టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో అన్ని కార్ల ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఓపెన్ చేసింది. కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కారును ఎంచుకొని బుక్ చేసుకునే అవకాశం కల్పించబడింది.

ఈ ప్రక్రియ తరువాత ఉత్తమ ఆఫర్లు, ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు ధర కొటేషన్ల గురించి చర్చించడానికి అమ్మకందారుల బృందం వాట్సాప్, ఇమెయిల్ లేదా వీడియో కాల్ ద్వారా వినియోగదారులతో సంప్రదిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత కస్టమర్ డీలర్షిప్ నుండి కారును ఎంచుకోవచ్చు అంతే కాకుండా డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించబడింది.

MOST READ:బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో బుకింగ్స్ ఇప్పుడు కేవలం రూ. 5000 మాత్రమే

భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?

టాటా మోటార్స్ మరోవైపు వారంటీ గడువు ముగిసిన వాహనాల కోసం దక్షిణాఫ్రికా, మిడిల్ ఈస్ట్, నేపాల్, భూటాన్, శ్రీలంక, నార్త్-వెస్ట్ ఆఫ్రికా, మరియు లాటిన్ అమెరికాలో ఉన్న వాణిజ్య వాహన వినియోగదారుల కోసం కంపెనీ రెండు నెలల పొడిగించిన వారంటీ వ్యవధిని ప్రకటించింది. ఇటీవల భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అవసరమైన వస్తువులు మరియు వస్తువులను రవాణా చేసే ట్రక్కుల కోసం సపోర్ట్ హెల్ప్‌లైన్ నంబర్ (1800 209 7979) ను ఏర్పాటు చేసింది.

Most Read Articles

English summary
Tata Motors Helps By Providing Necessary Supplies To Fight Against COVID-19. Read in Telugu.
Story first published: Saturday, April 25, 2020, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X