టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, రానున్న రోజుల్లో భారత మార్కెట్లో మరిన్ని కొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ కొన్ని పేర్లను పేటెంట్ చేసింది.

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

తాజాగా, రష్‌లేన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, టాటా మోటార్స్ "క్యామో", "డార్క్" అనే పేర్లతో స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు టాటా మోటార్స్ అప్లై చేసిన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పేపర్ ఒకటి లీక్ అయ్యింది. ఈ జాబితాలో టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ మరియు హారియర్ మోడళ్లు ఉన్నాయి.

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

టాటా మోటార్స్ నుంచి త్వరలో విడుదల కానున్న టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీలో కూడా స్పెషల్ ఎడిషన్ రానున్నట్లు ఈ పత్రం ద్వారా వెల్లడవుతోంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను స్టాండర్డ్ వేరియంట్లతో పాటుగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

అయితే, టాటా మోటార్స్ తమ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌లకు సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే ఈ క్యామో మరియు డార్క్ ఎడిషన్ మోడళ్లు రెండూ కూడా అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రెండింటిలో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

టాటా హారియర్ డార్క్ పేరిట కంపెనీ ఇప్పటికే ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ స్పెషల్ వేరియంట్‌లో ‘అట్లాస్ బ్లాక్' అని పిలువబడే ఆల్-బ్లాక్ పెయింట్ స్కీమ్, 17 ఇంచ్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో బ్లాక్-అవుట్ స్కఫ్ ప్లేట్లు, డార్క్-టోన్డ్ టెయిల్ ల్యాంప్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలోని ఇంటీరియర్స్‌లో కూడా బ్లాక్-అవుట్ క్యాబిన్, కాంట్రాస్ట్ గ్రే స్టిచింగ్‌తో బెనెక్ కాలికో లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ మరియు బ్లాక్‌స్టోన్ గ్రే డాష్‌బోర్డ్ ఉన్నాయి. స్టాండర్డ్ హారియర్ వేరియంట్లలో కనిపించే అన్ని క్రోమ్ ట్రిమ్‌లను కొత్త గన్‌మెటల్ గ్రే క్రోమ్ ప్యాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇది ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌లకు విశిష్టమైన రూపాన్ని జోడిస్తుంది.

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

టాటా ఆల్ట్రోజ్ డార్క్, నెక్సాన్ డార్క్, టిగోర్ డార్క్ మరియు టియాగో డార్క్ స్పెషల్ ఎడిషన్లకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్‌నే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, రాబోయే గ్రావిటాస్‌లో కూడా డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

వీటికి అదనంగా, టాటా మోటార్స్ తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోడళ్ల కొత్తగా క్యామో వేరియంట్‌ను కూడా పరిచయం చేయనుంది. రాబోయే క్యామో వేరియంట్ వివరాలు లేదా మార్పులు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇవి థీమ్‌కు తగినట్లుగానే ఇంటీరియర్స్ మరియు ఎక్స్‌టీరియర్స్‌లో కొద్దిపాటి కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

డెజర్ట్ క్యామో, ఆర్టిక్ క్యామో అని ఇప్పటికే అనేక రకాల క్యామోలు ఉన్నందను, టాటా మోటార్స్ పరిచయం చేయనున్న క్యామో వేరియంట్లు ఖచ్చితంగా గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి క్యామో వేరియంట్‌లకు కూడా డార్క్ ఎడిషన్ మాదిరిగానే ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను జోడించే అవకాశం ఉంది. ఇది కారు థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఉంటుంది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ నుంచి బోలెడు స్పెషల్ ఎడిషన్ కార్లు వస్తున్నాయ్..

టాటా మోటార్స్ నుండి రానున్న కొత్త స్పెషల్ ఎడిషన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇలా ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను అందించడం ద్వారా కంపెనీ తమ అమ్మకాలను మరింత పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. కస్టమర్లు ఫ్యాక్టరీ నుండే కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసిన టాటా కార్లను పొందుతున్న నేపథ్యంలో, వారు తమ కార్లను ఆఫ్టర్ మార్కెట్‌లో కస్టమైజ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

Source: Rushlane

Most Read Articles

English summary
Tata Motors will be introducing new special edition models of its existing and upcoming vehicle line-up in the country. The special edition model is expected to arrive sometime later this year in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X