టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు "టైమరో"!?

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. టాటా హెచ్‌బిఎక్స్ లేదా హార్న్‌బిల్ అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ మైక్రో ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

తాజాగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటాబేస్ నుండి లీకైన డాక్యుమెంట్ ప్రకారం, టాటా మోటార్స్ ఓ కొత్త పేరును ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసింది. ఈ డాక్యుమెంట్‌లో "టాటా టైమరో" అనే పేరును ప్రస్థావించారు. దీన్నిబట్టి చూస్తుంటే, టాటా నుండి రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసమే ఈ పేరును రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

ప్రస్తుతం టాటా మోటార్స్ నుంచి భారత్‌కు రెండు ఎస్‌యూవీలు మార్కెట్లోకి రానున్నాయి. అందులో ఒకటి హారియర్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తున్న పొడగించబడిన టాటా గ్రావిటాస్ 7-సీటర్ ఎస్‌యూవీ, మరొకటి పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రానున్న 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ గడచిన సంవత్సరంలోనే ఈ ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేయగా, తాజాగా సెప్టెంబర్ 2020 నెలలో లైసెన్స్ పొందింది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

టాటా మోటార్స్ గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఓ సరికొత్త హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది. ఈ కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది. ఆ కారుకి టైమరో అనే పేరును పెట్టవచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

టాటా నుంచి విడుదలైన పాపులర్ కార్ టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసినట్లుగానే ఆల్ఫా ఆర్కిటెక్చర్ మరియు ఇంపాక్ట్ 2.0 డిజైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఈ మైక్రో ఎస్‌యూవీని అభివృద్ది చేయనున్నట్లు సమాచారం. టాటా హ్యారియర్ ఎస్‌యూవీ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఎత్తుగా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

వాస్తవానికి టాటా మోటార్స్ ఈ మైక్రో ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికే మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేసింది. అయితే, అనూహ్యం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఈ మోడల్ విడుదల మరింత జాప్యమైంది. తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుతం ఈ కారు అభివృద్ధి దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

టాటా మైక్రో-ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లను హెడ్‌లైట్ హౌసింగ్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి. బంపర్ దిగువ భాగంలో ఫాగ్ లైట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తక్కవ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కారును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:మీకు తెలుసా.. ఇది భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

భారత్‌లోని గ్రామీణ పట్టణ రోడ్లకు అనుకూలంగా ఉండేలా రగ్డ్ లుక్‌తో మరియు బంప్‌లను తట్టుకునేందుకు వీలుగా పెద్ద వీల్ ఆర్చెస్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేసే ఆస్కారం ఉంది. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్‌తో ఈ చిన్న కారు మరింత స్టయిలిష్‌గా కనిపించనుంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న ఇంటీరియర్ తరహాలోనే ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో దాదాపు అవే ఇంటీరియర్స్ కనిపించే అవకాశం ఉంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

ఇందులో ప్రధానంగా, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ మరియు డ్యాష్‌బోర్డ్, ఆంబియెంట్ ఇంటీరియర్ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఈ కొత్త కారులో కూడా ఉండే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

టాటా ఆల్ట్రోజ్ కారులో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త టాటా హెచ్‌బిఎక్స్‌లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వచ్చే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ రిజిస్టర్ చేసిన టైమరో నేమ్‌ప్లేట్ చాలా వినూత్నంగా ఉంది. ఈ మైక్రో-ఎస్‌యూవీ మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో రావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మరియు రెనాల్ట్ క్విడ్‌ వంటి మోడళ్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata Motors registers Timero name for trademark in India. Reports suggest that it could be the new Compact SUV that Tata Motors is working on for India market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X