Just In
Don't Miss
- News
నటి శ్రీసుధపై వేధింపుల కేసు... కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుకి సుప్రీం కోర్టు నోటీసులు...
- Sports
సెంచరీ చేయలేదనే బాధ లేదు.. చేయాలనే ఆరాటం లేదు: విరాట్ కోహ్లీ
- Movies
'పంట చేతికొచ్చింది' అంటున్న శర్వానంద్.. శ్రీకారం సిద్దమైంది!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 1,147 పాయింట్లు జంప్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా మోటార్స్ అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసారా?
టాటా మోటార్స్ ఇటీవల బ్రాండ్ యొక్క అక్టోబర్ 2020 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. టాటా మోటార్స్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 27% అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 52,132 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్‌లో కంపెనీ 49,669 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. అక్టోబర్ 2019 లో 39,152 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అక్టోబర్ నెలలో అమ్మకాలు సెప్టెంబర్ నెల కంటే 12% ఎక్కువగాఉన్నాయి. టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలలో 44,444 యూనిట్లను విక్రయించింది. 2020 అక్టోబర్‌లో టాటా మోటార్స్ 23,617 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 13,169 యూనిట్లను విక్రయించింది.

కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల విషయానికొస్తే, 2020 అక్టోబర్‌లో కంపెనీ 26,052 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ ను విక్రయించింది. 2019 అక్టోబర్‌లో 25,983 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ అమ్ముడయ్యాయి.
MOST READ:ట్రాక్టర్ అమ్మకాలలో దూసుకెళ్తున్న సోనాలికా.. కారణం ఏంటో తెలుసా !

టాటా మోటార్స్ అక్టోబర్లో 5,033 యూనిట్ల బస్సులు, ట్రక్కులు మరియు ఇతర భారీ వాహనాలను విక్రయించింది. కంపెనీ గత నెలలో 40 లక్షల ప్యాసింజర్ కార్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది.

ఈ సంస్థ 2005 లో పది లక్షల కార్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2015 లో 3 మిలియన్లు, 2020 లో 4 మిలియన్ కార్లు పూర్తయ్యాయి. టాటా మోటార్స్ నాణ్యత మరియు పనితీరుకు బాగా ప్రసిద్ధి చెందింది.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ కారుగా రేటింగ్ పొందింది. టాటా మోటార్స్ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో కంపెనీ వాటా 67% వరకు ఉంటుంది.

నెక్సాన్ మరియు టిగోర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు. కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే పనిలో ఉంది. టాటా మోటార్స్ రాబోయే రోజుల్లో ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అంతే కాకుండా హారియర్ మరియు గ్రావిటాస్ 7-సీట్ల మోడళ్లతో పాటు, వచ్చే ఏడాది అనేక కొత్త మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?