గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ధరలను సైలెంట్‌గా తగ్గించింది. అయితే, ఈ ధరల తగ్గింపు కేవలం ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్‌ను బట్టి రూ.40,000 మేర ధరలు తగ్గాయి.

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి: ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ (ఆప్షనల్). డీజిల్ బేస్ వేరియంట్ ఎక్స్ఈ మినహా మిగిలిన అన్ని డీజిల్ వేరియంట్‌లపై ధరలు తగ్గాయి. ధరలు తగ్గిన తర్వాత, టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.99 లక్షల నుండి రూ.9.09 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

కాగా, ఈ ధరల తగ్గింపుకు గల కారణాన్ని టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. బహుశా డీజిల్ వేరియంట్లతో పోలిస్తే, పెట్రోల్ వేరియంట్లకు పెరుగుతున్న డిమాండే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ల అమ్మకాలను పెంచేందుకు కంపెనీ వీటిని ధరలను తగ్గించి ఉండొచ్చని అంచనా.

MOST READ:టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే, డీజిల్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ రూ.1.50 లక్షలు అధిక ధరను కలిగి ఉంటుంది. మిగిలిన అన్ని డీజిల్ వేరియంట్ల ధరలు వాటి పెట్రోల్ వేరియంట్లతో పోల్చుకుంటే సుమారు రూ.1.20 లక్షలు అధికంగా ఉంటాయి.

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

అయితే, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వేరియంట్ల మధ్య ధరల వ్యత్యాసం మాత్రం రూ.70,000 మించదు. బేస్ వేరియంట్ ఎక్స్‌ఈ మరియు ఎక్స్‌ఎమ్ వేరియంట్‌ల మధ్య ధరల వ్యత్యాసం రూ.51,000 మాత్రమే.

MOST READ:బెంగళూరులో టెస్లా రీసర్చ్ సెంటర్ ప్రారంభించనుందా.. అయితే ఇది చూడండి

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

ప్రస్తుతం మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

MOST READ:రోడ్ రోలర్‌గా మారిన టివిఎస్ బైక్ [వీడియో]

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, టాటా ఆల్ట్రోజ్‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు రివర్స్ కెమెరాతో కూడిన పార్కింగ్ సెన్సార్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. గ్లోబల్ ఎన్కాప్ క్రాష్-టెస్ట్ సమయంలో టాటా ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఫలితంగా, ఇది భారత మార్కెట్లో లభించే సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ల ధరల తగ్గింపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో డీజిల్ మోడళ్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, టయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

MOST READ:కార్ బోనెట్ మీద 200 మీటర్లు వేలాడుతూ వెళ్లిన హోమ్ గార్డ్‌ ; కారణం తెలిస్తే షాక్ అవుతారు

Most Read Articles

English summary
Tata Motors has silently decreased the prices of its Altroz premium hatchback in the Indian market. Only the Altroz diesel variants have received a price decrease of Rs 40,000 by the company. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X