ఈసారి మారుతి సుజుకిని ట్రోల్ చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈసారి మారుతి సుజుకి కార్లని టార్గెట్ చేసింది. సేఫ్టీ విషయంలో టాటా అందిస్తున్న కార్లు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటంతో, టాటా మోటార్స్ దేశంలోని ఇతర కార్ బ్రాండ్లను పోలుస్తూ వ్యగ్యంగా ట్వీట్స్ చేస్తోంది.

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. టియాగో ఈ విభాగంలో దాని కాంపిటీటర్లతో పోల్చుకుంటే, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.

టాటా మోటార్స్ పోస్ట్ చేసిన తాజా ట్వీట్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటాన్ని పరోక్షంగా కంపెనీ ప్రస్థావించింది. ఇదే ట్వీట్‌లో "OH SH ** T! WAGONE" అనే కామెంట్‌తో విరిగిన చక్రంతో కూడిన ఓ బండి ఫొటోను టాటా మోటార్స్ పోస్ట్ చేసింది.

టాటా టియోగో కారుకు ప్రధాన పోటీ మోడళ్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2019లో గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టులో వ్యాగన్ఆర్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులోని వయోజనులు మరియు పిల్లల భద్రతకు 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఈ రెండు మోడళ్లను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా తమ ప్రత్యర్థులను ట్రోల్ చేస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ యొక్క భద్రతా రేటింగ్‌ను టాటా టియాగోతో పోల్చింది.

టాటా టియాగో సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే, జిఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 5 స్టార్లకు గాను 4 స్టార్లను సాధించింది. ఇది వయోజన భద్రత కోసం 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను మరియు పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను దక్కించుకుంది.

టాటా టియాగో కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, (ఏబిఎస్) యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ (సిఎస్‌సి) కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ (ఇబిడి) ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టాప్-ఎండ్ వేరియంట్‌తో పోలిస్తే, ఇందులో మాత్రమే డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇలాంటి భద్రతా పరికరాలతో నిండి ఉంది. ఇంకా ఇందులో స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు మరియు లోడ్ లిమిటర్లు కూడా ఉన్నాయి.

ఇటీవల, గ్లోబల్ ఎన్‌సిఎపి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు కియా సెల్టోస్ క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఇవన్నీ, తక్కువ స్కోర్‌లను సాధించి, ఆక్యుపెంట్ సేఫ్టీలో విఫలమయ్యాయి. దీంతో టాటా మోటార్స్ తమ మెరుగైన సేఫ్టీ బ్రాండ్ కార్లను హైలైట్ చేయడం ద్వారా తమ పోటీదారులపై ట్రోల్స్ చేస్తోంది.

ప్రస్తుతం, టాటా మోటార్స్ విక్రయించే హారియర్ మినహా మిగిలిన అన్ని కార్లు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ లేదా 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. టాటా మోటార్స్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హారియర్‌కు ఇంకా క్రాష్ టెస్ట్ నిర్వహించలేదు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను టాటా మోటార్స్ ట్రోల్ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
పోటీదారులతో టాటా మోటార్స్ తమ మోడళ్లను పోల్చడం ద్వారా సేఫ్టీలో తమ బ్రాండ్ కార్లే అత్యుత్తమమైనవని తెలిపే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా టాటా మోటార్స్ వివిధ రకాల మోడళ్లను టార్గెట్ చేస్తూ, ఆ విభాగంలో టాటా అందిస్తున్న మోడళ్ల సేఫ్టీ రేటింగ్స్‌తో వాటిని పోల్చుతోంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా టియాగో తమ ప్రత్యర్థుల కంటే మెరుగైన సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








