ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షలతో అందించబడుతుంది. టాటా నెక్సాన్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్- ఇండియా).

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ లో మూడు ట్రిమ్ లు ఉంటాయి. అవి ఎక్స్ఎమ్, ఎక్స్జెడ్, మరియు XZ + LUX లు. టాటా నెక్సాన్లోని మూడు వేరియంట్లు అనేక ఫీచర్స్ తో మరియు కొంత నవీనీకరించబడి ఉంటుంది. కొత్త నెక్సాన్ ఇ వి ప్రామాణిక ఐసిఇ - శక్తితో కూడిన SUV యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. 21 వేల రూపాయలతో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిపించింది. ఈ బుకింగ్స్ ఆన్‌లైన్‌లో పొందవచ్చు, లేకుంటే ఇండియన్ మార్కెట్లో ప్రధాన నగరాలలో ఎంచుకున్న డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా నెక్సాన్ 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలకు శక్తినిస్తుంది. ఈ మోటార్ 30.2 కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 129 బిహెచ్‌పి శక్తీ వద్ద 245 ఎన్ఎన్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ఒకే చార్జిపై దాదాపు 312 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కానీ ఎటువంటి రోడ్డులో ఐనా ఇది 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని నిర్దారించబడింది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

కంపెనీ నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ని అందించడంతో పాటు వినియోగదారులకు కాంప్లిమెంటరీ హోమ్ ఛార్జింగ్ స్టేషన్ లను కూడా అందిస్తుంది. కస్టమర్ల యొక్క సౌలభ్యం కోసం ప్రధాన నగరాలలో వివిధ ప్రాంతాలలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

హోమ్ ఛార్జ్ కోసం 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 60 నిముషాల్లో నెక్సాన్ ఇవి బ్యాటరీలను 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు యొక్క పనితీరు వినియోగదారుని ఆకట్టుకునే విధానంగా ఉంటుంది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

టాటా నెక్సాన్ ఇవి మూడు రంగులలో లభించనుంది. అవి సిగ్నేచర్ టీల్ బ్లూ, గ్లాసియర్ వైట్ మరియు మూన్లిట్ సిల్వర్. నెక్సాన్ మార్కెట్లో ఈ మూడు ఆకర్షణీయ రంగులలో లభించనుంది.

ఇండియాలో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో ప్రారంభించబడ్డ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ఇండియన్ మార్కెట్లో టాటా కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కార్. టాటా నెక్సాన్ ఇవి, ఎంజి జెడ్ఎస్ ఇవి మరియు హ్యుందాయ్ కోన ఇవి వంటి వాటికి ప్రత్యర్థులుగా ఉండబోతోంది. నెక్సాన్ యొక్క డెలివరీలు త్వరలో ప్రారంభించబడతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2020, 14:51 [IST]
English summary
Tata Nexon EV Launched In India: Prices Start At Rs 13.99 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+